Ayodhya Ram Mandir | అయోధ్య రామాలయంలో శిల్పకళను చూద్దము రారండి
విధాత: భక్తజనులు ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామజన్మ (Ayodhya Ram Mandir) భూమి ఆలయం నిర్మాణం వడివడిగా సాగుతోంది. తాజాగా నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్… ట్విటర్ లో కొన్ని శిల్పాల ఫోటోలను పంచుకుంది. అద్భుతమైన ఈ శిల్పాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ప్రాచీన శిల్ప శాస్త్రాన్ని పాటిస్తూ అనుసరిస్తూ 3600 శిల్పాలను అయోధ్య ఆలయంలో భాగం చేయనున్నారు. ఇందులో దేవీదేవతల విగ్రహాలు,ప్రాచీనత ఉట్టిపడే డిజైన్లు, మొదలైనవి […]
విధాత: భక్తజనులు ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామజన్మ (Ayodhya Ram Mandir) భూమి ఆలయం నిర్మాణం వడివడిగా సాగుతోంది. తాజాగా నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్… ట్విటర్ లో కొన్ని శిల్పాల ఫోటోలను పంచుకుంది.

అద్భుతమైన ఈ శిల్పాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ప్రాచీన శిల్ప శాస్త్రాన్ని పాటిస్తూ అనుసరిస్తూ 3600 శిల్పాలను అయోధ్య ఆలయంలో భాగం చేయనున్నారు.

ఇందులో దేవీదేవతల విగ్రహాలు,ప్రాచీనత ఉట్టిపడే డిజైన్లు, మొదలైనవి ఇందులో భాగంగా ఉండనున్నాయి. అంతే కాకుండా ఆలయ స్తంభాలు, పైకప్పులనూ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. వీటి నిర్మాణంలో ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్రం నిపుణులు సహకారం అందిస్తున్నారు.

ప్రస్తుతం విగ్రహాలను వీటిని విడి విడిగా చెక్కి, ఆ తర్వాత నిర్దిష్ట ప్రదేశాలలో ప్రతిష్ఠించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2023 సంవత్సారాంతానికి గర్భాలయంలో మూలమూర్తిని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని తెలుస్తోంది. 2024 సంక్రాంతి తర్వాతి నుంచి భక్తులను అనుమతించనున్నారు.

భవ్య రామ మందిరాన్ని 110 ఎకరాల్లో సుమారు రూ.1000 కోట్లతో నిర్మిస్తున్నారు. నిర్మాణం దృఢంగా ఉండేందుకు స్టీల్ జాయింట్ల స్థానంలో రాగి జాయింట్లను ఉపయోగిస్తున్నారు. ప్రధాన ఆలయం, ఉపాలయాల సముదాయం, మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్స్, రీసెర్చ్ సెంటర్ల నిర్మాణానికి ఆగస్టు 5, 2020లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram