Ayodhya Ram Mandir| అయోధ్య రామాలయంపై ధర్మ ధ్వజ ప్రతిష్టాపన చేసిన మోదీ
అయోధ్య రామ మందిరంపై ధర్మ ధ్వజ ప్రతిష్టాపనోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజల మధ్య నిర్వహించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. సూర్యుడు, దేవ కాంచన చెట్టు, ఓం చిహ్నం ముద్రించిన ధర్మధ్వజం ఆవిష్కరణతో నూతన రామమందిరం నిర్మాణ పనులు పరిసమాప్తమయ్యాయి
న్యూఢిల్లీ : అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir)పై ధర్మ ధ్వజ (Dharma Dhwaja Installation) ప్రతిష్టాపనోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రత్యేక పూజల మధ్య నిర్వహించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. సూర్యుడు, దేవ కాంచన చెట్టు, ఓం చిహ్నం ముద్రించిన ధర్మధ్వజం ఆవిష్కరణతొ నూతన రామమందిరం నిర్మాణ పనులు పరిసమాప్తమయ్యాయి. ధర్మధ్వజ ఆవిష్కరణ ఘట్టానికి 7,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి అంతస్తులోని రామదర్భార్ లో, అన్నపూర్ణాదేవి, శేషావతారం మందిరం, సప్తర్షి మందిరాలను దర్శించుకున్న మోదీ పూజలు నిర్వహించారు. ధర్మ ధ్వజ పున ప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా రామ మందిరాన్ని 100టన్నుల పూలతో అలంకరించారు. మోదీ అయోధ్య పర్యటన సందర్బంగా ఆలయ పరిసరాలలో కట్టుదిట్టమైన బాధ్యత ఏర్పాట్లు చేశారు.
ధర్మ ధ్వజ ప్రతిష్టాపన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ రామమందిరం ధర్మధ్వజం కేవలం జెండా కాదు.. భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం అని అభివర్ణించారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని పేర్కొన్నారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందరి..రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి జరిగిందన్నారు పేదరికం, చింతనలు లేని సమాజం నిర్మాణానికి రామ మందిరం ధర్మధ్వజం ప్రేరణగా నిలుస్తుందన్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram