Viral Video | చింపాంజికి పాము కాటు.. తల్లడిల్లిన తల్లి ‘సమంత’
Viral Video | ఆస్ట్రేలియాలోని రాక్‌హాంప్టన్ జూలో ఓ చింపాంజిని పాము కాటేసింది. దీంతో ఆ పిల్ల చింపాంజి తల్లి తల్లడిల్లిపోయింది. చింపాంజి కోలుకున్న తర్వాత దాన్ని గుండెలకు హత్తుకుంది. మూడేండ్ల వయసున్న గండలి అనే చింపాంజి.. తన ఎన్‌క్లోజర్‌లో ఉన్న సమయంలో.. బ్రౌన్ స్నేక్ కాటేసింది. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది.. తక్షణమే వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. చింపాంజికి వైద్యం అందించడంతో అది కోలుకుంది. ఒక రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న చింపాంజిని, మరుసటి […]

Viral Video |
ఆస్ట్రేలియాలోని రాక్‌హాంప్టన్ జూలో ఓ చింపాంజిని పాము కాటేసింది. దీంతో ఆ పిల్ల చింపాంజి తల్లి తల్లడిల్లిపోయింది. చింపాంజి కోలుకున్న తర్వాత దాన్ని గుండెలకు హత్తుకుంది.
మూడేండ్ల వయసున్న గండలి అనే చింపాంజి.. తన ఎన్‌క్లోజర్‌లో ఉన్న సమయంలో.. బ్రౌన్ స్నేక్ కాటేసింది. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది.. తక్షణమే వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు.
చింపాంజికి వైద్యం అందించడంతో అది కోలుకుంది. ఒక రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న చింపాంజిని, మరుసటి రోజు ఉదయం తన సరోగట్ తల్లి సమంతను కలిసేందుకు జూ సిబ్బంది అవకాశం కల్పించారు. తన పిల్ల చింపాంజి వద్దకు సమంత పరుగెత్తి.. గుండెలకు హత్తుకుంది.
ప్రాణాలతో చింపాంజి బయట పడడంతో.. సమంత ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం గండలిని చింపాంజీల సమూహంలో వదిలేశారు. ప్రస్తుతం గండలికి ఎలాంటి ప్రమాదం లేదని జూ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.