Baby | భీమ‌వ‌రంలో బేబీ టీం ఢిష్యూం ఢిష్యూం!

Baby మీడియాను కుమ్మేసిన బౌన్స‌ర్లు నిర్మాత కారును అడ్డ‌గించి నిర‌న‌స‌ విధాత‌: ఇటీవ‌ల విడుద‌లైన బేబీ సినిమా యూనిట్‌కు, భీమ‌వ‌రం మీడియాకు మ‌ధ్య వివాదం రేగింది. సాయి రాజేష్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాకు, ఎస్.కె.ఎన్ (SKN) నిర్మాత. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా గురువారంరోజు రాజమండ్రి, శుక్ర‌వారం భీమవరం థియేటర్‌ల‌ను చిత్ర యూనిట్ సందర్శించారు. భీమవరంలో ఒక థియేట‌ర్‌కు ఈ సినిమా వాళ్ళు వస్తున్నార‌ని […]

  • By: krs    latest    Aug 04, 2023 11:17 AM IST
Baby | భీమ‌వ‌రంలో బేబీ టీం ఢిష్యూం ఢిష్యూం!

Baby

  • మీడియాను కుమ్మేసిన బౌన్స‌ర్లు
  • నిర్మాత కారును అడ్డ‌గించి నిర‌న‌స‌

విధాత‌: ఇటీవ‌ల విడుద‌లైన బేబీ సినిమా యూనిట్‌కు, భీమ‌వ‌రం మీడియాకు మ‌ధ్య వివాదం రేగింది. సాయి రాజేష్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాకు, ఎస్.కె.ఎన్ (SKN) నిర్మాత. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా గురువారంరోజు రాజమండ్రి, శుక్ర‌వారం భీమవరం థియేటర్‌ల‌ను చిత్ర యూనిట్ సందర్శించారు. భీమవరంలో ఒక థియేట‌ర్‌కు ఈ సినిమా వాళ్ళు వస్తున్నార‌ని తెలిసి పెద్ద ఎత్తున జ‌నం వ‌చ్చారు.

వారితో పాటు మీడియా కూడా చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఒక మీడియా రిపోర్ట‌ర్‌పై బౌన్స‌ర్లు విరుచుకుప‌డ్డారు. కానీ నిర్మాత మాత్రం “జనం విపరీతంగా వచ్చి మీద పడిపోతున్నారు. అలాంటి సమయంలో బౌన్సర్లు ముందుగా మా టీము వాళ్ళని సేవ్ చెయ్యడానికి చూస్తారు. ఎందుకంటే అంత క్రౌడ్ ఒక్కసారిగా మీద పడితే మామూలుగా ఉండదు కదా. అందుకని బౌన్సర్లు అలా వచ్చిన క్రౌడ్ ని కొంచెం నెట్టారు, అంతే,” అని చెప్పుకున్నారు. అక్క‌డి నుంచి కార్లో బ‌య‌లుదేరిని చిత్ర నిర్మాత‌, న‌టుల కారును స్థానిక మీడియా ప్ర‌తినిధులు అడ్డుకున్నారు.

దీంతో నిర్మాత కారు దిగి స‌ర్దిచెప్పారు. తాను కూడా 15 ఏళ్లకు పైగా మీడియాలో పని చేసానని, మీడియా అంటే ఎప్పుడూ తనకు గౌరవం అని, ఈ సంఘటన యాదృచ్చికంగా జరిగిన సంఘటన అని న‌చ్చ‌చెప్పారు. అప్ప‌టికే అక్క‌డికి స్థానిక పోలీసులు చేరుకుని గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణిచారు. కింద‌ప‌డిన మీడియా ప్ర‌తినిధిని చిత్ర యూనిట్ వాళ్లే హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. బౌన్సర్ తో సారీ కూడా చెప్పించారు.