ఆ చెప్పుల ధర రూ. 9 వేలు.. మీరు ఓ లుక్కేయండి మరి..

Hugo Boss | బాత్రూం చెప్పులకు, ఇతర పనులకు వేసుకెళ్లే చెప్పులకు తేడా పక్కా ఉంటుంది. ధర కూడా ఆ విధంగానే ఉంటుంది. బాత్రూం చెప్పులకు రూ. 100 కంటే ఎక్కువ పెట్టే ప్రసక్తే లేదు. ఇక బయటకు వేసుకెళ్లే చెప్పులకు అయితే ఒక వెయ్యి రూపాయాల దాకా పెడుతాం. కానీ వేళల్లో అసలు పెట్టలేం. కానీ ఓ బ్రాండ్ మాత్రం బాత్రూం చెప్పులకు భారీ ధర పెట్టేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దామా మరి.. లగ్జరీ […]

ఆ చెప్పుల ధర రూ. 9 వేలు.. మీరు ఓ లుక్కేయండి మరి..

Hugo Boss | బాత్రూం చెప్పులకు, ఇతర పనులకు వేసుకెళ్లే చెప్పులకు తేడా పక్కా ఉంటుంది. ధర కూడా ఆ విధంగానే ఉంటుంది. బాత్రూం చెప్పులకు రూ. 100 కంటే ఎక్కువ పెట్టే ప్రసక్తే లేదు. ఇక బయటకు వేసుకెళ్లే చెప్పులకు అయితే ఒక వెయ్యి రూపాయాల దాకా పెడుతాం. కానీ వేళల్లో అసలు పెట్టలేం. కానీ ఓ బ్రాండ్ మాత్రం బాత్రూం చెప్పులకు భారీ ధర పెట్టేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దామా మరి..

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హుగో బాస్ బాత్రూం చెప్పుల ఖరీదును రూ. 8,990 గా నిర్ణయించారు. బ్లూ కలర్ లో ఉన్నాయి. అయితే ఆ చెప్పులకు ఏదో ప్రత్యేకత, ఆకర్షణీయంగా ఉంటాయనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. అవి ఫుట్ పాత్ మీద దొరికే చెప్పుల కంటే అద్వాన్నంగా ఉన్నాయి. దీంతో ఆ చెప్పులకు అంత ధరనా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆ చెప్పులను ట్రోల్ చేస్తున్నారు.

రూ. 150 కి దొరికే చెప్పులకు రూ. 8,990 అంటూ హేళన చేస్తున్నారు. ఇదే కలర్ లో, ఇదే క్వాలిటీ చెప్పులు ఫుట్ పాత్ పై రూ. 50 కే దొరుకుతాయని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీమార్ట్ లో అయితే ఈ చెప్పులు రూ. 99కే దొరుకుతాయని జోకులు పేల్చారు. ఒక వేళ నేను కోటిశ్వరుడినైనా.. అంత ధర పెట్టి.. ఇంత చీప్ చెప్పులు కొనని ఎద్దెవా చేశారు. ఇక ఇండియాలో జరిగే వారాంతపు సంతల్లో అయితే ఆ చెప్పులు కేవలం రూ. 50 కే దొరుకుతాయని పేర్కొన్నారు. ఈ చెప్పులు నెట్టింట వైరల్ గా మారి విమర్శలను ఎదుర్కొంటున్నాయి.