Bengaluru | డ్రైవ‌ర్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆర్టీసీ బ‌స్సు న‌డిపిన బెంగ‌ళూరు ACP..!

Bengaluru విధాత‌: బెంగ‌ళూరులో బ‌స్సు డ్రైవ‌ర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) బీ రామచంద్ర బ‌స్సు న‌డిపి ప్రయాణికుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. అస్వ‌స్థ‌త‌కు గురైన డ్రైవ‌ర్‌ను ద‌వాఖాన‌కు త‌రలించేందుకు అంబులెన్స్‌ను పిలిపించారు. త‌న సిబ్బందితో డ్రైవ‌ర్‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. రోడ్డుపై నిలిచి ట్రాఫిక్ ఇబ్బందిగా మారిన బ‌స్సును స్వ‌యంగా న‌డిపారు. బస్సును షెల్టర్‌కు తీసుకెళ్లారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. బెంగ‌ళూరులో సోమ‌వారం విప‌క్ష పార్టీల స‌మావేశం జ‌రిగింది. దీనిని వివిధ రాష్ట్రాల […]

Bengaluru | డ్రైవ‌ర్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆర్టీసీ బ‌స్సు న‌డిపిన బెంగ‌ళూరు ACP..!

Bengaluru

విధాత‌: బెంగ‌ళూరులో బ‌స్సు డ్రైవ‌ర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) బీ రామచంద్ర బ‌స్సు న‌డిపి ప్రయాణికుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. అస్వ‌స్థ‌త‌కు గురైన డ్రైవ‌ర్‌ను ద‌వాఖాన‌కు త‌రలించేందుకు అంబులెన్స్‌ను పిలిపించారు. త‌న సిబ్బందితో డ్రైవ‌ర్‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. రోడ్డుపై నిలిచి ట్రాఫిక్ ఇబ్బందిగా మారిన బ‌స్సును స్వ‌యంగా న‌డిపారు. బస్సును షెల్టర్‌కు తీసుకెళ్లారు. అస‌లు ఏం జ‌రిగిందంటే..

బెంగ‌ళూరులో సోమ‌వారం విప‌క్ష పార్టీల స‌మావేశం జ‌రిగింది. దీనిని వివిధ రాష్ట్రాల నుంచి విప‌క్ష పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. ఎయిర్‌పోర్టు మార్గంలో బెంగళూరు మెట్రోపాలిట‌న్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (బీఎంటీఎస్‌)కు చెందిన బ‌స్సు న‌డుపుతున్న డ్రైవ‌ర్ ఒక్క‌సారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బ‌స్సును రోడ్డుపైనే ప్ర‌యాణికుల‌తో స‌హా నిలిపివేశారు.