AP CM Jagan: జగన్‌కు పెద్ద చిక్కే… భాస్కర్ రెడ్డి అరెస్ట్… అవినాష్ రెడ్డి ఫ్యూచర్?

విధాత‌: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తాజా పరిణామం వైయస్ కుటుంబానికి, ముఖ్యంగా జగన్‌కు తలనొప్పిగా పరిణమించేలా ఉంది. అది చివరకు ఆయన రాజకీయ ప్రయాణానికి సైతం అడ్డం పడుతోంది. ఆ హత్యకేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారడం, ఆ తరువాత మొన్న వైయస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమారి రెడ్డిని సైతం అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా నేడు వివేకా సోదరుడు భాస్కర్ రెడ్డిని నేడు అరెస్ట్ […]

AP CM Jagan: జగన్‌కు పెద్ద చిక్కే… భాస్కర్ రెడ్డి అరెస్ట్… అవినాష్ రెడ్డి ఫ్యూచర్?

విధాత‌: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తాజా పరిణామం వైయస్ కుటుంబానికి, ముఖ్యంగా జగన్‌కు తలనొప్పిగా పరిణమించేలా ఉంది. అది చివరకు ఆయన రాజకీయ ప్రయాణానికి సైతం అడ్డం పడుతోంది. ఆ హత్యకేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారడం, ఆ తరువాత మొన్న వైయస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమారి రెడ్డిని సైతం అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా నేడు వివేకా సోదరుడు భాస్కర్ రెడ్డిని నేడు అరెస్ట్ చేసింది.

భాస్కర్ రెడ్డి కుమారుడే అవినాష్ రెడ్డి (కడప ఎంపీ) అన్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్నాళ్ళు దర్యాప్తు చేస్తారు.. గమ్మున ముగించండి అంటూ ఆ మధ్య కోర్టు చీవాట్లు పెట్టిన నేపథ్యంలో దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ తాజాగా ఆ కేసుకు సంబంధించి ఇన్నాళ్లుగా అందరూ అనుమానిస్తూ వచ్చిన వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఇక ఇప్పుడు అందరి వేళ్ళూ, కళ్ళూ ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి వైపే చూస్తున్నాయి.

అవినాష్ రెడ్డిని ఇది వరకు సీబీఐ పలుమార్లు విచారణ జరిపి ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని, అందరితోబాటే తనకూ ఆ ఘటన తరువాత తెలిసి అక్కడికి వెళ్లేసరికి తన బాబాయ్ చనిపోయి ఉన్నారని ఆయన ఇప్పటికే మీడియాకు చెప్పారు. అయినా సరే సీబీఐ మాత్రం ఈ కేసులో అవినాష్ పాత్రను మొదటి నుంచీ సందేహిస్తూ, ఆయన పాత్ర ఉందన్నట్లుగానే దర్యాప్తు చేస్తోంది. ఈరోజు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఇప్పుడు వైయస్సార్ పార్టీ, కుటుంబంలో పెద్ద కుదుపు సంభవించినట్లు అయింది.

ఇక రేపు సోమవారం అనంతపురంలో వసతి దీవెన నగదు బదిలీ పథకం ప్రారంభించడానికి అనంతపురం వెళ్లాల్సి ఉన్న వైయస్ జగన్, ఇప్పుడు ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తరువాత ఏం చేయాలి, అవినాష్ అరెస్ట్ ఐతే ఎలా? ప్రతిపక్షాలు, మీడియాకు ఎలాంటి సమాధానం చెప్పాలి వంటి పలు ముందస్తు ఏర్పాట్ల కోసమే జగన్ అనంతపురం టూర్ కాన్సిల్ చేసుకున్నారని అంటున్నారు.