Bhola Shankar విధాత: చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా శుక్రవారం విడుదల కానుండగా ఇప్పుడు సినిమా చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. ఒక వైపు ఆంధ్ర ప్రభుత్వంతో చిరంజీవి వివాదానికి దిగినట్లు మాట్లాడగా.. ఇప్పుడు దాని ఫైనాన్స్ సంబంధ సమస్యలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ సినిమా నిర్మాత అనీల్ సుంకరకు, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కు మధ్య ఏజెంట్ సినిమాకు సంబంధించి వివాదం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో సతీష్ మీడియా ముందుకొచ్చారు. అనీల్ సుంకర తనను […]
Bhola Shankar
విధాత: చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా శుక్రవారం విడుదల కానుండగా ఇప్పుడు సినిమా చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. ఒక వైపు ఆంధ్ర ప్రభుత్వంతో చిరంజీవి వివాదానికి దిగినట్లు మాట్లాడగా.. ఇప్పుడు దాని ఫైనాన్స్ సంబంధ సమస్యలు కూడా తెరమీదకు వచ్చాయి.
ఈ సినిమా నిర్మాత అనీల్ సుంకరకు, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కు మధ్య ఏజెంట్
సినిమాకు సంబంధించి వివాదం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో సతీష్ మీడియా ముందుకొచ్చారు. అనీల్ సుంకర తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన కోర్టుకెక్కారు.
ఏజెంట్ సినిమా కోసం 30 కోట్లు తీసుకొని తనను మోసం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా భోళాశంకర్ కు ఇంకో సమస్య ఎదురైంది. ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతలు తమను సంప్రదించారని అయితే ఆ దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, దానికి సరిపడా పాత్రలు సమర్పించలేదని అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఇలా సమస్యలు ఉన్నాయని అంటున్నారు.