Bhola Shankar | భోళా శంక‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్.. టీమిండియాదే వ‌ర‌ల్డ్ క‌ప్..!

Bhola Shankar | ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అక్టోబ‌ర్ నుంచి 13వ ఎడిషన్ వరల్డ్ కప్ ప్రారంభం కానుండ‌గా, టైటిల్ ఫేవ‌రేట్ ఇండియానే అంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియా రెండు సార్లు మాత్ర‌మే వ‌రల్డ్ క‌ప్ గెలుచుకుంది. ఒక‌సారి క‌పిల్ దేవ్ నేతృత్వంలో 1983లో క‌ప్ గెలుచుకోగా, మ‌రోసారి ధోని నేతృత్వంలో 2011లో భార‌త్‌కి వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కింది. ఈ ఏడాది రోహిత్ శ‌ర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉండ‌గా, […]

  • By: sn    latest    Aug 14, 2023 9:09 AM IST
Bhola Shankar | భోళా శంక‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్.. టీమిండియాదే వ‌ర‌ల్డ్ క‌ప్..!

Bhola Shankar |

ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అక్టోబ‌ర్ నుంచి 13వ ఎడిషన్ వరల్డ్ కప్ ప్రారంభం కానుండ‌గా, టైటిల్ ఫేవ‌రేట్ ఇండియానే అంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియా రెండు సార్లు మాత్ర‌మే వ‌రల్డ్ క‌ప్ గెలుచుకుంది. ఒక‌సారి క‌పిల్ దేవ్ నేతృత్వంలో 1983లో క‌ప్ గెలుచుకోగా, మ‌రోసారి ధోని నేతృత్వంలో 2011లో భార‌త్‌కి వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కింది.

ఈ ఏడాది రోహిత్ శ‌ర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉండ‌గా, ఆయ‌న నేతృత్వంలో భార‌త్ క‌ప్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు కొన్ని సెంటిమెంట్స్ చూపిస్తూ జోస్యం చెబుతున్నారు. తాజాగా భోళా శంక‌ర్ ఫ్లాప్‌తో భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవ‌డం గ్యారెంటీ అని అంటున్నారు.

చిరంజీవి, త‌మ‌న్నా, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కించిన చిత్రం భోళా శంక‌ర్. భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రూ.101 కోట్లతో సినిమా తెరకెక్కగా.. 30 కోట్ల బిజినెస్ కూడా నమోదు చేయ‌క‌పోవ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ ప‌ర‌చింది.

బిజినెస్ క్లోజ్ అయ్యే నాటికి కనీసం రూ.50 కోట్ల మేర నష్టం వ‌స్తుందేమోన‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నారు. అయితే ఇంత దారుణ‌మైన ఫ్లాప్ చిత్రం తెర‌కెక్కించి మెహ‌ర్ ర‌మేష్ గ‌తంలో కూడా అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాలు తీసాడు. ఆ సమ‌యంలోనే భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో భోళా శంక‌ర్ సినిమా ఫ్లాప్ భార‌త్‌కి వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకొచ్చిపెడుతుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

2011లో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన శక్తి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అదే సంవత్సరం జ‌రిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్‌లో భారత్.. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను మట్టి కరిపించి విజేతగా ఆవిర్భవించింది. ఇక 2013లో వెంకటేష్ నటించిన షాడో సినిమా విడుదలై దారుణమైన ఫ్లాప్ అయింది.

ఆ సంవ‌త్స‌రం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది భారత క్రికెట్ జట్టు. ఇలా రెండు సార్లు అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాలు మెహ‌ర్ తీసిన‌ప్పుడు భార‌త్ ఐసీసీ ట్రోఫీని అందుకుంది. ఇక ఈ ఏడాది భోళా శంక‌ర్ వంటి డిజాస్టర్ తీయ‌గా, ఇదే సంవ‌త్స‌రం వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ జ‌ర‌గ‌నుండ‌గా, ఆ టోర్నీలో భార‌త్ క‌ప్ గెల‌వ‌డం ఖాయం అంటున్నారు.