Bhupalpally | కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ కొత్త హరిబాబు అరెస్ట్
భూపాలపల్లి జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు
భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు
భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాలపల్లి జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. కబ్జాలకు దిగితే ఎవరినైనా వదిలేది లేదని, భూ కబ్జాలకు గురైన బాధితులు తమ పరిధిలోని పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. సామాన్యులకు, పేద ప్రజలకు న్యాయం చేయడమే తమ అభిమతమని ఎస్పీ వెల్లడించారు.
భూ కబ్జాకు యత్నించిన కౌన్సిలర్ కొత్త హరిబాబును మంగళవారం భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. భూపాలపల్లి పరిధిలోని కాసింపల్లికి చెందిన ఓ వ్యక్తికి చెందిన జామాయిల్ తోటను ధ్వంసం చేసి కాపలాదారులపై దాడి చేసి అక్రమంగా జామాయిల్ తోటలో రోడ్లు వేసి పక్కా ప్రణాళికతో బాధితుడి భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తుండగా, బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భూపాలపల్లి పోలీసులు, మున్సిపల్ కౌన్సిలర్ కొత్త హరిబాబుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram