బెంగళూరులో పేలుడు.. నలుగురికి తీవ్రగాయాలు
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో పేలుడు సంభవించింది. కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో పేలుడు సంభవించింది. కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. మంటలు కూడా చెలరేగాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘనటాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది. గాయపడ్డ వారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది కాగా, మరొకరు బయటి వ్యక్తి. ఈ పేలుడు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేఫ్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.