Rapido Bike Rider Attack: యువతిపై రాపిడో బైక్ రైడర్ దాడి ..వీడియో వైరల్

Rapido Bike Rider Attack: ప్రయాణికుల పట్ల ఇటీవల క్యాబ్..రాపిడో డ్రైవర్ల దురుసు ప్రవర్తనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతిపై రాపిడో బైక్ రైడర్ దాడి చేసిన ఘటన వీడియో వైరల్ గా మారింది. బెంగుళూరులో రాపిడో బైకును బుక్ చేసుకున్న ఓ యువతి…ర్యాష్ డ్రైవింగ్ కారణంగా బైక్ రైడర్ తో గొడవకు దిగింది. బైక్ దిగిన అనంతరం డబ్బులు చెల్లించే విషయమై వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రైడ్ నియమాల ఉల్లంఘనపై..ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేయడంపై ర్యాపిడో బైక్ రైడర్ ను నిలదీసింది. తాను అడిగిన డబ్బులు చెల్లించనని చెప్పింది. దీంతో కోపాద్రిక్తుడైన ర్యాపిడో బైక్ రైడర్ ఆ యువతిపై దాడికి పాల్పడ్డాడు.
తనను ప్రశ్నిచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాపిడో డ్రైవర్ ఆ యువతిపై చెంప దెబ్బ కొట్టడంతో ఆమె నేలపై పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులో యువతిపై రాపిడో డ్రైవర్ దాడి
రాపిడో బైకును బుక్ చేసుకున్న ఓ యువతి… ర్యాష్ డ్రైవింగ్ కారణంగా డ్రైవర్‌తో గొడవకు దిగిన యువతి.
బైక్ దిగిన అనంతరం డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో రాపిడో డ్రైవర్ చెంప దెబ్బ కొట్టడంతో నేలపై పడిపోయిన యువతి.#Rapido pic.twitter.com/vo93ggTttl
— greatandhra (@greatandhranews) June 16, 2025