Jagadish Reddy| మీడియా ముసుగులో కేసీఆర్, కేటీఆర్ లపై అసత్య ప్రచారం

మీడియా హౌస్‌ల పేరిట స్లాటర్ హౌస్‌లు
కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టం
విధాత : మీడియా ముసుగులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సాగుతున్న దుష్ప్రచారాలను చూస్తు ఊరుకోబోమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహా న్యూస్ పై జరిగింది నిరసన మాత్రమేనని..మేం దాడులు చేస్తే తట్టుకోలేరన్నారు. ఇంకో రెండు, మూడు సంస్థలు కూడా ఉన్నాయని..వాటి పని కూడా త్వరలో చూస్తామన్నారు. మీడియా ముసుగులో స్లాటర్ హౌస్ లు నడుపుతున్నారని..మీ చేతిలో మీడియా ఆయుధంతో మీరు దాడి చేస్తే లక్షలాది కేసీఆర్ అభిమానులు వారి చేతుల్లోనే ఆయుధాలతో వారు కూడా దాడి చేస్తారన్నారు. మా సహనానికి కూడా పరీక్ష ముగిసిందని..ఏడాదిన్నర కాలంగా ఓపిక పట్టామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ల వ్యక్తిత్వాలను హననం చేయబట్టే దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా మహాన్యూస్ కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలకు చెప్పాలని..లేదంటే మేం ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. ఎక్కడ దాక్కున్న బిన్ లాడెన్ ను వెతికినట్లుగా వెతికి పట్టుకుని మీ పనిచేస్తామన్నారు. తెలంగాణ పోలీసులు మేమిచ్చే పిటిషన్లపై ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని..కాంగ్రెసోళ్లు ఇచ్చిన అక్రమ పిటిషన్ల తీసుకుని మాపై కేసులు పెడుతున్నారని..ఈ పరిస్థితుల్లో ఇక ప్రజాకోర్టుల్లోనే శిక్షలు వేస్తామన్నారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
మాపై దుష్ప్రచారం చేసే సంస్థలను కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టబోమన్నారు. మీ బలుపు ఏంది.. మీ అహంకారం ఏంది..ఎవడ్ని చూసుకొని మీకు ఈ బలుపు..మేం దాడి మొదలుపెట్టం అని మాత్రం అనుకోకండని హెచ్చరించారు. ఎక్కడ ఉంటున్నారు.. ఎక్కడ బతుకుతున్నారు..ఎవరి తిండి తింటున్నారో ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ ఆంధ్ర నుంచి తెలంగాణను విడదీశాడు అనే కోపంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని..చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను చూసి మురుస్తున్న వారిని భవిష్యత్ లో ఎవరు కాపాడలేరన్నారు. రాజకీయ పార్టీలుగా మేము మేము తేల్చుకుంటాం..మధ్యలో మీడియా అసత్య ప్రచారాలెందుకు? అని ప్రశ్నించారు.
కన్నెపల్లి పంప్ హజ్ ప్రారంభించి జిల్లాకు నీళ్లివ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిపాలన ఉన్నట్లుగా ప్రజలకు కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన తాగు, సాగునీరు, కరెంటు కూడా సక్రమంగా ప్రజలకు అందించలేకపోతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అజ్జానంతో సోయి లేకుండా ఉన్నారన్నారు. ప్రతి ప్రాజెక్టు వద్ధకు పోయి కేసీఆర్ మీద ఏడిస్తే లాభం లేదన్నారు. ప్రజలకు నీళ్లు కావాలే తప్ప నీ కన్నీళ్లతో పనిలేదన్నారు. కాళేశ్వరం కట్టి ఉత్తమ్ నియోజకవర్గానికి, జిల్లాకు నీళ్లు ఇచ్చామన్నారు. ఇవ్వాళ జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని..వేసిన విత్తనాలు వానాలు లేక మొలకలు ఎండిపోయాయన్నారు. వరినార్లు ఎండిపోయాయని తెలిపారు. ఇకనైనా కన్నెపల్లి పంప్ హౌజ్ లు ఆన్ చేసి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. రాజకీయ డ్రామాలు కన్నపల్లి పంప్ హౌజ్ ద్వారా జిల్లా ప్రజలకు, రైతులకు నీళ్లు ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.