Palamuru | ఏపీకి గ‌ట్టి షాక్.. పాల‌మూరు-రంగారెడ్డికి లైన్ క్లియ‌ర్‌

Palamuru | ఏపీకి గ‌ట్టి షాక్ ఇచ్చిన జ‌స్టిస్‌ బ్రిజేష్ ట్రిబ్యునల్‌ విధాత‌, హైద‌రాబాద్‌: పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప్రాజెక్టుపై ఏపీకి కృష్ణా ట్రిబ్యున‌ల్ గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కృష్ణాబోర్డును ఆశ్రయించింది. ఏపీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను బుధ‌వారం జ‌స్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ తోసిపుచ్చింది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, రంగారెడ్డి, న‌ల్లగొండ జిల్లాల్లోని 12.30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు, 1200 గ్రామాల‌కు తాగు నీరు అందించేందుకు రాష్ట్ర […]

  • By: krs    latest    Sep 20, 2023 3:50 PM IST
Palamuru | ఏపీకి గ‌ట్టి షాక్.. పాల‌మూరు-రంగారెడ్డికి లైన్ క్లియ‌ర్‌

Palamuru |

ఏపీకి గ‌ట్టి షాక్ ఇచ్చిన జ‌స్టిస్‌ బ్రిజేష్ ట్రిబ్యునల్‌

విధాత‌, హైద‌రాబాద్‌: పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప్రాజెక్టుపై ఏపీకి కృష్ణా ట్రిబ్యున‌ల్ గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కృష్ణాబోర్డును ఆశ్రయించింది. ఏపీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను బుధ‌వారం జ‌స్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ తోసిపుచ్చింది.

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, రంగారెడ్డి, న‌ల్లగొండ జిల్లాల్లోని 12.30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు, 1200 గ్రామాల‌కు తాగు నీరు అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న‌ది. దీనికి అవ‌స‌ర‌మైన 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు గత ఏడాది ఆగష్టులో ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే దానిని స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం పోయిన గత ఏడాది డిసెంబర్ లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్‌ ను ఆశ్ర‌యించింది. దీనిపై వాదోప‌వాద‌న‌లు విన్న ట్రిబ్యున‌ల్ రాష్ట్రాల మ‌ధ్య జోక్యం చేసుకునే హ‌క్కు కేంద్ర‌ ప్ర‌భుత్వం త‌మ‌కు ఇవ్వ‌లేద‌ని, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండ‌ని సూచించింది. దీంతో పాల‌మూరు-రంగారెడ్డి ప‌నులు వేగంగా పూర్తి చేసే అవ‌కాశం ఉన్న‌ది.