BIGBOSS: ముగిసినట్టేనా.. ఇక అంతేనా!

విధాత‌: మహా మేధావులు కూడా కొన్ని విషయాల్లో బోల్తా పడుతుంటారు. నిజానికి కొన్ని కొన్ని విషయాలు ఆయా ప్రాంతాలకే పరిమితం. కొన్ని షోలు, కొన్ని నేటివిటీలు కొన్ని భాషలకు, ప్రాంతాల‌కు, వారి క‌ల్చ‌ర్‌కు సరిపోతాయి. అందరూ ఇలాంటివే చూస్తారు అనుకోవడం గొర్రె దాటు మంద టైపు. కానీ జనాలు అంత పిచ్చోళ్లేం కాదు. వారు మహా మేధావులు. ఎక్కడ ఎక్కించాలో తెలియడమే కాదు.. ఎక్కడ నొక్కాలో కూడా వారికి బాగా తెలుసు. దీన్నే కీళ్లెరిగి వాత‌ పెట్ట‌డం […]

BIGBOSS: ముగిసినట్టేనా.. ఇక అంతేనా!

విధాత‌: మహా మేధావులు కూడా కొన్ని విషయాల్లో బోల్తా పడుతుంటారు. నిజానికి కొన్ని కొన్ని విషయాలు ఆయా ప్రాంతాలకే పరిమితం. కొన్ని షోలు, కొన్ని నేటివిటీలు కొన్ని భాషలకు, ప్రాంతాల‌కు, వారి క‌ల్చ‌ర్‌కు సరిపోతాయి. అందరూ ఇలాంటివే చూస్తారు అనుకోవడం గొర్రె దాటు మంద టైపు. కానీ జనాలు అంత పిచ్చోళ్లేం కాదు. వారు మహా మేధావులు.

ఎక్కడ ఎక్కించాలో తెలియడమే కాదు.. ఎక్కడ నొక్కాలో కూడా వారికి బాగా తెలుసు. దీన్నే కీళ్లెరిగి వాత‌ పెట్ట‌డం అంటారు. ఇదే విషయం బిగ్‌బాస్ విషయంలో మ‌రోసారి రుజువైంది. వాస్తవానికి బిగ్ బాస్ అనేది తెలుగు సెంటిమెంట్‌కి ఏమాత్రం సెట్ అయ్యే షో కాదు.

తెలుగువారి ఆచార వ్యవహారాలు, వారి ఆలోచన విధానం ఆ విధంగా ఉండవు. ఏదో కాస్త హైదరాబాద్, వైజాగ్ వంటి మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీలో ఓకే గాని మిగతా చోట్ల జాంతానై. కానీ నిర్వాహకులు ఏమో.. హిందీ బిగ్ బాస్ అంత హిట్ అయింది… ఇంత హిట్.. అయిందని పోటీ పడ్డారు. స్టార్ మాలో ఆరు సీజన్లు పూర్తి చేశారు.

పెద్దపెద్ద కౌన్ బనేగా కరోడ్ పతి వంటి నాలెడ్జ్ ఇచ్చే షోల‌కే ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది.. అలాంటిది కేవలం ఎంటర్టైన్మెంట్ మీద నడిచే ఇలాంటి అడ‌ల్ట్ షోలకు కుటుంబ సభ్యుల్లో యువత ఓకే గాని పెద్దలు మాత్రం నో అంటారు. ఇప్పుడు అదే జరిగింది.

నాగార్జున, నాని ఇలా ఎవరు ఈ షోని కాపాడలేక పోయారు. ఎన్టీఆర్ ఏదో కాస్త లాగించాడు. మొత్తానికి నాగ్ విషయాన్ని పక్కన పెడితే బిగ్ బాస్ షో పట్ల వీక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఈ రియాల్టీ షో డిజాస్టర్ అవ్వడమే కాదు ఐదో సీజన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆరో సీజన్ గురించి అసలు ఆలోచించ‌డ‌మే దండగ.

కంటెస్టెంట్లు పిఆర్ టీమ్స్‌ను పెట్టుకొని హంగామా చేసినా అవి పని చేయలేదు. గ్రాండ్ ఫినాలే అయిపోయింది.. సింగర్ రేవంత్ కప్ కొట్టాడు.. అయినా సోషల్ మీడియాలో బిగ్ బాస్ హ్యాష్‌ట్యాగ్ హంగామానే లేదు. ఎవరు ఉంటున్నారు.. ఎవరు పోతున్నారు అనేది వీక్షకులకు స్పష్టంగా తెలిసి పోతుంది. దాంతో అందరూ లైట్‌గా తీసుకున్నారు.

ఫినాలే పరిస్థితి మరింత దారుణం. ఐదో ప్లేస్ రోహిత్, నాలుగో ప్లేస్ ఆదిరెడ్డి, మూడో ప్లేస్ కీర్తి మొదటి ప్లేస్ రేవంత్ అని ఫినాలేకి ముందే ప్రచారం జరిగింది.. చివరికి అదే నిజమైంది. అసలే మాత్రం ఆసక్తి కలిగించని టాస్క్‌లు బిగ్ బాస్‌ను దెబ్బతీశాయి. లీకులు కూడా బాగా దెబ్బేశాయ్.

ఫినాలే రోజున సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించి చర్చ లేదు. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు మరీ దారుణం ఏమిటంటే చెప్పుకోదగ్గ స్థాయిలో సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వీకెండ్స్ లో సందడి చేయలేకపోయారు. నిర్వాహకులు లైట్ తీసుకున్నారు.

నాగార్జునకు దింపుడు క‌ళ్లెం ఆశలు మాత్రమే మిగిలాయి. మొత్తానికి తదుపరి సీజన్ ఉంటుందా? అంటే ఎవరు చెప్పలేరు. ఇక్కడితోనే ముగింపు పలికేటట్టు ఉన్నారని, ఒక వేళ కంటిన్యూ అయినా.. నాగార్జున ఈ షోకి హోస్ట్‌గా చేయరనేలా వార్తలు వైరల్ అవుతుండటం విశేషం. చూద్దాం.. ఏం జరుగుతుందో?