లోన్ తీసుకొని బట్టలు కొనుకున్నా: యావర్.. పవరాస్త్ర ఆమెకే..!

మూడో పవరాస్త్ర కోసం బిగ్ బాస్ హౌజ్‌లో పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే.ఈ పోటీలో భాగంగా యావర్, శోభ, ప్రియాంకలు ఆ అస్త్రాన్ని దక్కించుకునేందుకు అనేక ఆలోచనలు చేస్తుంటారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఆ ముగ్గురు కంటెస్టెంట్స్‌తో పాటు సందీప్‌ని కూడా గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెబుతాడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ముందు మూడో కంటెండర్ అమర్ దీప్ అని పిలిచి.,కాదు కాదు.. ప్రియాంక అంటూ.. అమర్‌కి గట్టి పంచే ఇస్తాడు.
ఇక ఆ తర్వాత టాస్క్ గురించి తెలియజేస్తాడు. మూడవ పవరాస్త్ర కోసం సాధించేందేకు మీ ముగ్గురు ఎంతో కష్టపడ్డారని.. చెప్పిన బిగ్ బాస్ ..ఈ పవరాస్త్ర పోరులో తర్వాతి లెవల్‌కి వెళ్లడానికి ఇద్దరు మాత్రమే పోటీ పడనున్నారు. మరి ఆ ఇద్దరు ఎవరనేది డిసైడ్ చేసిది కూడా మీ ముగ్గురే అంటూ వారిని ఇరికిస్తాడు బిగ్ బాస్.
యావర్, శోభ, ప్రియాంక..ఈ ముగ్గురిలో వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరో మెజారిటీ ద్వారా నిర్ణయించుకుని.. ఆ తర్వాత వీకెస్ట్ కంటెస్టెంట్ బొమ్మను.. ఇద్దరూ కలిసి సుత్తితో పగలగొట్టాలని చెబుతాడు బిగ్ బాస్. సంచాలక్ సందీప్ ఆద్వర్యంలో.. డిస్కషన్ స్టార్ట్ చేసిన ముగ్గురు కంటెండర్స్.. ఎవరు స్ట్రాంగ్ .. ఎవరు వీక్ అంటూ గట్టిగా వాదించుకుంటారు. అమ్మాయిలు ఇద్దరు యావర్‌ని పక్కకు నెట్టేస్తే బాగుంటుందని అనుకుంటారు.
శోభ తన మనసులో ఉన్న మాట యావర్‌కి చెబుతుంది. దానికి యావర్ ఏ మాత్రం ఒప్పుకోడు. శోభ, యావర్ ఒకరి మీద ఒకరు ఓటు వేసుకుంటారు. దీంతో ప్రియాంక డెసీషన్ మేకర్ కావడంతో కొంత సేపు ఆలోచించి ప్రిన్స్ యావర్ వీక్ అని చెప్పుకొస్తుంది.
తనని వీక్ అని ప్రియాంక చెప్పడంతో టెంపర్ కోల్పోయి గట్టి గట్టిగా అరుస్తాడు. నానా రచ్చ చేస్తాడు. అవేమీ పట్టించుకోని ప్రియాంక శోభ.. యావర్ బొమ్మను పగలగొట్టి ఫైనల్ టాస్క్ కు చేరుకుంటారు. అయితే యావర్ ఆ కోపంలో బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి ఏడుస్తూ తన బాధని శివాజీ ముందు చెప్పుకుంటాడు. ‘నేనంటే అందరికీ ఎందుకు భయం’ అని చెబుతూ..
బిగ్ బాస్ లోకి రావడానికి కూడా లోన్ పెట్టానని.. క్లోత్స్ కొనేందుకు కూడా తన బ్రదర్ దగ్గర డబ్బులు తీసుకున్నానని.. నా దగ్గర మనీ ఏ మాత్రం లేవు. గెలవాలనే కసితోనే నాకు ఈ అగ్రెషన్ వస్తుంది అంటూ ఏడుస్తూ శివాజీకి తన బాధని తెలియజేశాడు. ఇక యాక్టివిటీ ఏరియలో యాంగ్రీ బుల్ సెటప్ చేసిన బిగ్ బాస్.. కంటెండర్స్ ఇద్దరూ బుల్ పై సవారీ చేస్తూ.. దాదాపు మూడు రౌండ్లు ఆడాల్సి ఉంటుందని చెబుతారు.మరి ఆ మూడు రౌండ్స్‌లో ఎవరు ఎక్కువ సేపు బుల్‌పై ఉండి పవరాస్త్ర దక్కించుకున్నారనేది శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున చెప్పనున్నారు