Delhi | ఆటోలో వెళుతున్న యువతి చేతిలోని ఐఫోన్ (I Phone)ను గమనించిన ఇద్దరు దుండగులు.. దానిని దొంగలించే క్రమంలో ఆమెను రోడ్డుపై పడేసి బైక్‌లతో ఈడ్చుకుపోయారు. ఈ భయంకర ఘటన దిల్లీ (Delhi) లో జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యోవికా చౌదరి.. స్కూల్ పూర్తయిన అనంతరం ఇంటికి ఆటోలో బయలుదేరారు. ఆమె చేతిలో ఐఫోన్‌ను చూసిన దుండగులు రెండు బైక్‌లపై ఆటోను కాస్త దూరం వెంబడించారు. ఆటో పక్కనే బండి నడిపిస్తూ ఆమె చేతిలోని […]
Delhi |
ఆటోలో వెళుతున్న యువతి చేతిలోని ఐఫోన్ (I Phone)ను గమనించిన ఇద్దరు దుండగులు.. దానిని దొంగలించే క్రమంలో ఆమెను రోడ్డుపై పడేసి బైక్‌లతో ఈడ్చుకుపోయారు. ఈ భయంకర ఘటన దిల్లీ (Delhi) లో జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యోవికా చౌదరి.. స్కూల్ పూర్తయిన అనంతరం ఇంటికి ఆటోలో బయలుదేరారు.
ఆమె చేతిలో ఐఫోన్‌ను చూసిన దుండగులు రెండు బైక్‌లపై ఆటోను కాస్త దూరం వెంబడించారు. ఆటో పక్కనే బండి నడిపిస్తూ ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన యోవికా.. ఆ ఫోన్‌ను వదలకపోవడంతో దుండగులు బండి వేగాన్ని పెంచారు. దీంతో యోవికా ఆటోలోంచి రోడ్డుపై పడి పోయింది. అయినా పట్టువిడవని దుండగులు ఆమెను అలా ఈడ్చుకుంటూనే కొద్ది దూరం వెళ్లారు.
ఈ క్రమంలో ఆ బాధను భరించలేక బాధితురాలు ఫోన్‌ను వదిలేయడంతో.. వారు ఆ ఐఫోన్‌తో చక్కా పోయారు. ఈ ఘటనలో యోవికా ముక్కుకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమేరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.