Love Marriage | ల‌వ‌ర్‌తో ప్రేమ పెళ్లికి.. బంధువుల ఇంట్లో రూ. 47 ల‌క్ష‌లు దొంగిలించిన ప్రియుడు

Love Marriage | ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ వివాహ వేడుక‌కు( Marriage Function ) డ‌బ్బుల్లేక‌పోవ‌డంతో.. దొంగ‌త‌నం చేయాల‌ని ప్రియుడు( Lover ) నిశ్చ‌యించుకున్నాడు. దీంతో ఏకంగా బంధువు ఇంట్లో రూ. 47 ల‌క్ష‌లు దొంగిలించాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

  • By: raj |    national |    Published on : Oct 12, 2025 9:00 AM IST
Love Marriage | ల‌వ‌ర్‌తో ప్రేమ పెళ్లికి.. బంధువుల ఇంట్లో రూ. 47 ల‌క్ష‌లు దొంగిలించిన ప్రియుడు

Love Marriage | బెంగళూరు : ఓ ప్రియుడు( Lover ) త‌న ప్రియురాలిని( Girl Friend ) పెళ్లాడేందుకు ఏకంగా బంధువుల ఇంట్లో దొంగ‌త‌నానికి( Stolen ) పాల్ప‌డ్డాడు. రూ. 47 ల‌క్ష‌లు దొంగిలించాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క( Karnataka ) రాజ‌ధాని బెంగ‌ళూరులోని హెబ్బ‌గోడి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. శ్రేయాష్ అనే యువ‌కుడు గత నాలుగేండ్ల నుంచి ఓ యువ‌తితో ప్రేమ‌లో ఉన్నాడు. అయితే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ల‌వ్ మ్యారేజ్‌కు డబ్బులు లేక‌పోవ‌డంతో.. ఎలా పెళ్లి( Love Marriage ) చేసుకోవాలో వారికి అర్థం కాలేదు. ఇక దొంగ‌త‌న‌మే స‌రైన మార్గ‌మ‌ని భావించారు.

ఈ క్ర‌మంలో శ్రేయాస్ త‌న బంధువు హ‌రీశ్ ఇంట్లో దొంగ‌త‌నం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో సెప్టెంబ‌ర్ 15వ తేదీన హ‌రీశ్ ఇంట్లో చోరీకి పాల్ప‌డ్డాడు. 416 గ్రాముల బంగారం, రూ. 3.46 ల‌క్ష‌ల న‌గ‌దును శ్రేయాష్ అప‌హ‌రించాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు శ్రేయాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అత‌న్ని నుంచి బంగారం, న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. బంగార, న‌గ‌దు క‌లిపి రూ. 47 ల‌క్ష‌ల విలువ చేస్తుంద‌ని పోలీసులు పేర్కొన్నారు.