BJP | మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో ఈటెల భేటీ
BJP పార్టీ మార్పుపై ఉమ్మడి ఖండన విధాత: బీజేపీ నాయకత్వం తీరుపై అసమ్మతితో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారని భావిస్తున్న మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తో బీజేపీ ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. బీజేపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు, చంద్రశేఖర్ పార్టీనీ వీడబోతున్నారన్న అంశాలపై వారు చర్చించారు. భేటీ అనంతరం ఈటెల మాట్లాడుతు చంద్రశేఖర్ గాని, తాను గాని పార్టీలు మారడం లేదన్నారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు […]

BJP
- పార్టీ మార్పుపై ఉమ్మడి ఖండన
విధాత: బీజేపీ నాయకత్వం తీరుపై అసమ్మతితో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారని భావిస్తున్న మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తో బీజేపీ ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. బీజేపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు, చంద్రశేఖర్ పార్టీనీ వీడబోతున్నారన్న అంశాలపై వారు చర్చించారు.
భేటీ అనంతరం ఈటెల మాట్లాడుతు చంద్రశేఖర్ గాని, తాను గాని పార్టీలు మారడం లేదన్నారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారలేమన్నారు. చంద్రశేఖర్, తాను తెలంగాణ ఉద్యమం నుండి కూడా సుదీర్ఘంగా కలిసి పనిచేశామన్నారు. ఆయనకు, నాకు కామన్ ఎజెండా ఉందన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడంలో కలిసి సాగుతామన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణకు బీజేపీ కేంద్ర నాయకత్వం సానుకూలంగా ఉందన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతు ఈటెల, తాను బీజేపీలో పరిణామాలపై చర్చించామని, తనకు పార్టీ మారాలని ఆలోచన లేదని, బీజేపీ పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలన్న విషయాలపై చర్చించామన్నారు.