Black Hole | కృష్ణబిలంలో.. మనిషి పడితే?
మనిషి పొడవైన పాస్తా గొట్టంలా మారిపోతాడు: శాస్త్రవేత్తలు విధాత: ఈ అనంత విశ్వం(Universe)లో వింతలకు విశేషాలకు కొదవ లేదు. మనకు అర్థం కానికి అర్థం చేసుకోలేనివి చాలానే అంశాలుంటాయి. అందులో కృష్ణబిలం (Black Hole) ఒకటి. తనలో పడిన కాంతి సైతం తిరిగి బయటకు రాలేనంత ఆకర్షణ శక్తి (Gravitational Energy) దాని సొంతం. ఒక వేళ భవిష్యత్తులో మన భూమి ఎప్పుడైనా బ్లాక్‌హోల్‌లో పడితే పరిణామాలు ఎలా ఉంటాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. భూ గోళం […]
మనిషి పొడవైన పాస్తా గొట్టంలా మారిపోతాడు: శాస్త్రవేత్తలు
విధాత: ఈ అనంత విశ్వం(Universe)లో వింతలకు విశేషాలకు కొదవ లేదు. మనకు అర్థం కానికి అర్థం చేసుకోలేనివి చాలానే అంశాలుంటాయి. అందులో కృష్ణబిలం (Black Hole) ఒకటి. తనలో పడిన కాంతి సైతం తిరిగి బయటకు రాలేనంత ఆకర్షణ శక్తి (Gravitational Energy) దాని సొంతం. ఒక వేళ భవిష్యత్తులో మన భూమి ఎప్పుడైనా బ్లాక్‌హోల్‌లో పడితే పరిణామాలు ఎలా ఉంటాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
భూ గోళం కృష్ణ బిలంలోకి ప్రవేశిస్తేగనక మనుషులు అందరూ పెద్ద సైజు పాస్తా (Pasta) లా మారిపోతారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిపై ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జేవియర్ కామెట్ స్పందిస్తూ.. ‘మనుషులు కృష్ణ బిలంలోకి వెళ్లగానే వారి శరీరం పొడవైన పాస్తా గొట్టంలా మారిపోతుంది. ఆ తర్వాత క్షణాల్లోనే పీలికలు పీలికలుగా చెదిరిపోతుంది. ఈ ప్రక్రియ పరమ బాధాకరంగా ఉంటుంది’ అని ఆయన అన్నారు.
అయితే ఈ పరిణామాలన్నీ వెంట వెంటనే జరిగిపోతాయని.. ఆ బాధ మనకు తెలిసేలోపే ప్రాణాలు కోల్పోతామని చెప్పారు. భూ అంతం ఎలా అవుతుందన్న దానిపై డా.డేవిడ్ క్లెమెంట్స్ స్పందించారు. భూమి బ్లాక్‌హోల్‌కు చేరుకునే క్రమంలో రెండు రకాలుగా అంతమయ్యే అవకాశముందన్నారు. ఒకటి భూ వాతావరణం చెదిరిపోయి లేదా సముద్రాలు భారీ తాడుల్లా మారి ముంచెత్తుతాయని అన్నారు. అతి స్వల్ప కాలంలోనే భూమి నిష్క్రమణం (Earth’s Destruction) జరుగుతుందని తెలిపారు.
అయితే ఇప్పట్లో భూమి కృష్ణ బిలంలో పడే ప్రమాదాం దాదాపుగా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనకు తెలుసున్న భూమి చరిత్రలో ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ప్రతి 4.5 బిలియన్ సంవత్సరాలకు ఒకసారి ఇలా జరిగే అవకాశముందని కొంత మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఒకవేళ ఇలాంటి ప్రమాదం వస్తే అది భూమికి దగ్గర్లోనే ఉన్న బీహెచ్ 1 కృష్ణ బిలం నుంచి వచ్చే అవకాశం ఉంది. దీని సైజు మన సూర్యుని (Sun) కంటే 10 రెట్లు పెద్దది. దగ్గర్లోనే అంటే పక్కనే కాదు సుమా.. సుమారు 1600 కాంతి సంవత్సరాల (Light Years)దూరంలో ఉంటూ ఇది మన భూమి కోసం ఎదురు చూస్తోంది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram