Brahmani | పొలిటికల్ స్క్రీన్ మీదకు బ్రహ్మణి.. పోటీ చేస్తారా!

Brahmani | చంద్రబాబు అరెస్ట్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అవుతోంది. ఇన్నాళ్ళూ దాగుడు మూతలు ఆడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ నేరుగా టీడీపీకి మద్దతు తెలిపారు. జగన్ మీద దూకుడుగా కామెంట్స్ చేయడం తాను చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తామని చెప్పడం.. దీని కోసం నాదెండ్ల మనోహర్ సారథ్యంలో పొత్తుల కమిటీ ఏర్పాటు.. ఇవన్నీ రాజకీయ హీట్ పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య కూతురు, లోకేష్ భార్య బ్రహ్మణి సైతం రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు. ఇప్పటికే […]

  • Publish Date - September 18, 2023 / 04:03 AM IST

Brahmani |

చంద్రబాబు అరెస్ట్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అవుతోంది. ఇన్నాళ్ళూ దాగుడు మూతలు ఆడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ నేరుగా టీడీపీకి మద్దతు తెలిపారు. జగన్ మీద దూకుడుగా కామెంట్స్ చేయడం తాను చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తామని చెప్పడం.. దీని కోసం నాదెండ్ల మనోహర్ సారథ్యంలో పొత్తుల కమిటీ ఏర్పాటు.. ఇవన్నీ రాజకీయ హీట్ పెంచుతున్నాయి.

ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య కూతురు, లోకేష్ భార్య బ్రహ్మణి సైతం రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ మామయ్య చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టారని, ఈ విషయం ఎనిమిదేళ్ళ తమ కుమారుడు దేవాన్ష్ కు సైతం తెలుసని అన్నారు.

మరో వైపు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉంటే ఆ సమీపంలోనే ఇల్లు తీసుకుని భువనేశ్వరి.. లోకేష్.. బ్రహ్మణి నివాసం ఉంటున్నారు. వాస్తవానికి భువనేశ్వరి, బ్రాహ్మణి గతంలో ఎన్నడూ రాజకీయాల్లోకి రాలేదు. ఇన్నేళ్లలో భువనేశ్వరి సైతం బాబు కోసం ఎపుడూ ప్రచారం చేయలేదు. కానీ కోడలు బ్రహ్మణి తొలిసారి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సమర్ధవంతమైన నాయకుడు అని ఆయనను ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు అని ఆరోపించారు.

టీడీపీకి ఆదరణ పెరుగుతోందని, తన మామ చంద్రబాబు, భర్త లోకేష్ జనంలో ఉంటున్నారని, వారికి లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీ ప్రభుత్వం భయపడే ఈ అరెస్టులు చేస్తోందని అన్నారు. దీంతో పాటు ఆమె క్యాండిల్ ర్యాలీ చేశారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలో బ్రహ్మణి సైతం ఎన్నికల్లో ప్రచారం చేస్తారని, లేదా ఎన్నికల్లో సైతం పోటీ చేయొచ్చని అంటున్నారు. వీలైతే ఆమె సైతం పాదయాత్ర చేస్తారని అంటున్నారు. మొత్తానికి నారా.. నందమూరి కుటుంబాలు మొత్తం రాజకీయాల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Latest News