1,500 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్
-ఖర్చులను తగ్గించుకొనేందుకే -ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాల దిశగా సంస్థ విధాత: ప్రముఖ ఆన్‌లైన్ విద్యా బోధన సంస్థ బైజూస్ మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించింది. తాజాగా దాదాపు 1,500 మందికి గుడ్‌బై చెప్పింది. ఖర్చుల నియంత్రణ, ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాల దిశగా అడుగులు వేస్తున్న ఈ ఎడ్‌టెక్ యునికార్న్.. గత ఏడాది అక్టోబర్‌లోనూ సుమారు 2,500 మందిని తీసేసిన విషయం తెలిసిందే. సంస్థ మొత్తం సిబ్బందిలో ఇది 5 శాతానికి సమానం. నిజానికి ఇకపై ఎవ్వరి ఉద్యోగాలూ పోవని నాడు […]

-ఖర్చులను తగ్గించుకొనేందుకే
-ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాల దిశగా సంస్థ
విధాత: ప్రముఖ ఆన్‌లైన్ విద్యా బోధన సంస్థ బైజూస్ మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించింది. తాజాగా దాదాపు 1,500 మందికి గుడ్‌బై చెప్పింది. ఖర్చుల నియంత్రణ, ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాల దిశగా అడుగులు వేస్తున్న ఈ ఎడ్‌టెక్ యునికార్న్.. గత ఏడాది అక్టోబర్‌లోనూ సుమారు 2,500 మందిని తీసేసిన విషయం తెలిసిందే. సంస్థ మొత్తం సిబ్బందిలో ఇది 5 శాతానికి సమానం.
నిజానికి ఇకపై ఎవ్వరి ఉద్యోగాలూ పోవని నాడు బైజూస్ వ్యవస్థాపక సీఈవో బైజూ రవీంద్రన్ అన్నారు. అయినప్పటికీ ఈ ఏడాది ఆరంభంలోనే ఉద్యోగ కోతలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జరిగినదే ఈ 1,500 మంది ఉద్యోగులపై వేటు. కాగా, డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ విభాగాల్లో ఈ తొలగింపులు జరిగినట్టు తెలుస్తున్నది.
అయితే ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్, ఇతర సమాచారాల రూపంలో కాకుండా, ఆఫీసుకు పిలిచి నేరుగా పింక్ స్లిప్‌లను ఉద్యోగుల చేతిలో సంస్థ పెట్టిందని అంటున్నారు. ఇప్పుడిప్పుడే వాట్సప్‌ల్లో ఉద్యోగులకు తొలగింపుల సమాచారాన్ని సంస్థ చేరవేస్తున్నట్టు చెప్తున్నారు. ఆపరేషన్స్, లాజిస్టిక్స్, కస్టమర్‌కేర్, ఇంజినీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌కు కంపెనీ యోచిస్తున్నది. అందుకే ఇప్పుడున్న ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నదని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.