Jaya Prada | కాస్టింగ్ కౌచ్‌కి అమ్మాయిల తప్పు కూడా ఉంది.. వారు అలా చేయబట్టే..?
Jaya Prada | ప్రతిభ ఉంటే కెరియర్‌లో దూసుకుపోవడం ఖాయమని నమ్మేవారు 70, 80 లలో హీరోయిన్లు. వాళ్ళను ప్రాంతాల వారీగా విడదీయకుండా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించేవారు నిర్మాతలు, దర్శకులు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అవకాశం కోసం అమ్మాయిలే ముందుకు వెళ్ళి మరీ కమిట్ అవుతున్నారు. ఇది చాలా తప్పు. ఎవరో కొందరు ఇలా చేయడం వల్ల కాస్టింగ్ కౌచ్ అనే ప్రమాదమైన వాతావరణం ఇండస్ట్రీలోకి చొరబడుతుంది. దీనితో ఎంతో టాలెంట్ ఉన్నవారు కూడా కాస్టింగ్ […]

Jaya Prada |
ప్రతిభ ఉంటే కెరియర్‌లో దూసుకుపోవడం ఖాయమని నమ్మేవారు 70, 80 లలో హీరోయిన్లు. వాళ్ళను ప్రాంతాల వారీగా విడదీయకుండా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించేవారు నిర్మాతలు, దర్శకులు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అవకాశం కోసం అమ్మాయిలే ముందుకు వెళ్ళి మరీ కమిట్ అవుతున్నారు. ఇది చాలా తప్పు.
ఎవరో కొందరు ఇలా చేయడం వల్ల కాస్టింగ్ కౌచ్ అనే ప్రమాదమైన వాతావరణం ఇండస్ట్రీలోకి చొరబడుతుంది. దీనితో ఎంతో టాలెంట్ ఉన్నవారు కూడా కాస్టింగ్ కౌచ్ ఉచ్చులో పడుతున్నారని ప్రముఖ నటి, రాజకీయవేత్త జయప్రద తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడామె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు నుంచి వచ్చిన ఎందరో అమ్మాయిలు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి సక్సెస్ అయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అగ్ర తారలుగా వెలిగారు. ఆ కోవకు చెందిన నటీమణే స్టార్ హీరోయిన్ జయప్రద. ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో పుట్టి ఓ టైంలో తెలుగు సినీ ప్రపంచంలో తన నటనతో, హావభావాలతో అగ్ర తారగా వెలిగింది. సినిమాలు చేస్తూనే రాజకీయాల వైపు కూడా వెళ్ళిన జయప్రద అక్కడ కూడా విజయాన్నే అందుకుంది.
ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయినప్పటికీ.. అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ మెరుస్తోంది. అయితే తాజాగా జయప్రద ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ, అందులో ఆమె మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఇప్పటి రోజుల్లో నటనవైపు వస్తున్నవారంతా కాస్టింగ్ కౌచ్ ఉచ్చులో పడడానికి తప్పు అమ్మాయిల వైపు కూడా ఉన్నదని.. నిర్మాతలకు, డైరెక్టర్లకూ దగ్గరై.. ఛాన్స్‌ల కోసం దిగజారుతున్నారని ఆమె తెలిపింది.
అదృష్టవశాత్తు తనకు అలాంటి పరిస్థితులు ఎదురవలేదని, ఈ పరిస్థితిలో మార్పు వెంటనే రాకపోయినా అమ్మాయిలు కాస్త పట్టుగా ఉండి టాలెంట్‌ని నమ్ముకుంటే తప్పకుండా సక్సెస్ వైపు వెళతారని జయప్రద తెలిపింది. ప్రస్తుతం జయప్రద కాస్టింగ్ కౌచ్ మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీనియర్ నటీమణులు ఇలాంటి సలహాలు ఇస్తే.. ఇండస్ట్రీలోని ఆడవారికి ఎంతో మంచి జరుగుతుందనేలా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.