Chiranjeevi | చిరంజీవి బర్త్ డే.. మారుమ్రోగిపోతున్న సోషల్ మీడియా
Chiranjeevi | భారతీయ చిత్ర పరిశ్రమలో కొందరి నటులు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి సేవా గుణంలోను తనకి ఎవరు సాటిరారని నిరూపించుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులతో ఆపద్భాందవుడిగా మారిన చిరంజీవి ప్రజల గుండెలలో దేవుడిగా కొలువై ఉన్నాడు. ఈ […]

Chiranjeevi |
భారతీయ చిత్ర పరిశ్రమలో కొందరి నటులు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి సేవా గుణంలోను తనకి ఎవరు సాటిరారని నిరూపించుకున్నారు.
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులతో ఆపద్భాందవుడిగా మారిన చిరంజీవి ప్రజల గుండెలలో దేవుడిగా కొలువై ఉన్నాడు. ఈ రోజు చిరంజీవి 68వ బర్త్ డే జరుపుకుంటుండగా, ఆయనకి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఒక రోజు ముందుగానే జనసేనాని పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకి ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లుగా మీ ప్రయాణం నాకు గోచరిస్తోంది.
మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకుండా లక్షలాదిమందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా… కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తోన్న విజయాలు అజరామరమైనవి.
ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya’ అంటూ ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ తో పాటు మెగా హీరోలు, ఇతర సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా 157 సినిమా ప్రకటన ఈ రోజు రానున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహించనుండగా, ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కించనున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ నవంబర్‌లో షురూ కానుందని తెలుస్తోంది. ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం.