Celebrity Villa | కార్తీక దీపం మనోజ్‌కు రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు
Celebrity Villa విధాత: శామీర్ పేట సెలెబ్రిటీ విల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మనోజ్‌కు 14రోజుల రిమాండ్ విధించగా, పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. స్మితా భర్త సిద్ధార్ధ్ శామీర్ పేట పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మనోజ్‌ను అరెస్టు చేశారు. మనోజ్ తనపై ఎయిర్‌గన్‌తో నాలుగుసార్లు కాల్పులు జరిపాడని, గన్ ఎక్కుపెట్టగానే తాను తప్పించుకుని స్మితా ఇంటి నుండి బయటకు […]
Celebrity Villa
విధాత: శామీర్ పేట సెలెబ్రిటీ విల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మనోజ్‌కు 14రోజుల రిమాండ్ విధించగా, పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. స్మితా భర్త సిద్ధార్ధ్ శామీర్ పేట పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మనోజ్‌ను అరెస్టు చేశారు.
మనోజ్ తనపై ఎయిర్‌గన్‌తో నాలుగుసార్లు కాల్పులు జరిపాడని, గన్ ఎక్కుపెట్టగానే తాను తప్పించుకుని స్మితా ఇంటి నుండి బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశానన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో తన పిల్లల ఫిర్యాదు పై జరుగుతున్న విచారణకు సంబంధించి తాను స్మితా ఇంటికి తన కూతురుతో మాట్లాడేందుకు వచ్చానన్నారు. ఆ సమయంలో మనోజ్ తనపై కాల్పులు జరిపాడన్నారు.
2019నుండి స్మితా, తాను విడిపోయామని, తదుపరి ఆమె మనోజ్‌కు దగ్గరైందన్నారు. మనోజ్ తన భార్యకు ఎలా పరిచయమయ్యాడో తనకు తెలియదన్నారు. తమ పిల్లలిద్దరు తల్లి స్మితా వద్దనే ఉంటున్నారని తెలిపారు. మనోజ్ తమను వేధిస్తున్నాడని తన కొడుకు ఫిర్యాదు మేరకు సీడబ్ల్యుసీలో విచారణ సాగుతుందని సిద్ధార్ధ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram