Hyderabad: నా కారు ఆపడానికి ఎన్ని గుండెలు.. 2నిమిషాల్లో ట్రాన్స్‌ఫర్ చేయిస్తా! పంజాగుట్టలో కారు ఓనర్ హల్చల్

Hyderabad:
విధాత: పంజాగుట్టలో కారు ఓనర్ నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట మెర్క్యూర్ హోటల్ వద్ద గురువారం ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కారును ఆపి తనిఖీ చేస్తుండగా రూ.4వేలకు పైగా ఛలానా బకాయిలు ఉన్నట్లు తేలింది.
అట్టి అమౌంట్ వెంటనే చెల్లించాలని పోలీసులు కోరగా నాలుగు వేల పెండింగ్ చలానా కోసం నా కారు ఆపడానికి మీకు ఎన్ని గుండెలు.. నా ఇంట్లో కారుకు 16 వేల పెండింగ్ ఛలానా ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా అంటూ వీరంగం సృష్టించాడు.
రెండు నిమిషాల్లో మిమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ ట్రాఫిక్ పోలీసుల మీద చిందులు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.