మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. సగానికి పడిపోయిన చికెన్‌ ధరలు..!

మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌. గత కొద్దిరోజుల పాటు విపరీతంగా పెరిగిన చికెన్‌ ధరలు భారీగా పతనమయ్యాయి. కార్తీకమాసం కావడంతో ధరలు దిగివచ్చాయి

మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. సగానికి పడిపోయిన చికెన్‌ ధరలు..!

విధాత‌: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌. గత కొద్దిరోజుల పాటు విపరీతంగా పెరిగిన చికెన్‌ ధరలు భారీగా పతనమయ్యాయి. కార్తీకమాసం కావడంతో ధరలు దిగివచ్చాయి. కరోనా మహమ్మారి తర్వాత మాంసం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా చికెన్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో చికెన్‌ ధర కిలోకు రూ.300 వరకు పెరిగింది.


ప్రస్తుతం కార్తీక మాసంకరోనా సమయంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్‌ ధర ఏకంగా రూ.300 వరకు పలికింది. అలాగే ఎన్నికలు సైతం కలిసి రావడంతో చికెన్‌ ధరలు ఆకాశాన్నంటాయి. అయితే, దీపావళి తర్వాత కార్తీక మాసం ప్రారంభం కావడంతో చికెన్‌ తినే వారి సంఖ్య తగ్గింది. దీంతో ధర సగానికి దిగి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌తో చికెన్‌ రూ.130-150 వరకు పలుకుతుంది.


అదే సమయంలో స్కిన్‌లెస్‌ రూ.180కి తగ్గింది. అయితే, గడిచిన నాలుగు నెలల్లో చికెన్‌ ధరలు ఇంత తక్కువకు పడిపోవడం ఇదే తొలిసారి. పలుచోట్ల అమ్మకాలు 40శాతం వరకు తగ్గిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కార్తీక మాసం ముగిసే వరకు చికెన్‌ ధరలు ఇలాగే కొనసాగే అవకాశాలుంటాయని చెబుతున్నారు.