రష్యాకు.. చైనా మద్దతిస్తే.. ప్రపంచ యుద్ధమే! ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ వార్నింగ్‌

విధాత: సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ తనకు మద్దతు పలికేందుకు తన దేశానికి వచ్చారన్న ఆనందమో.. ఏమోగానీ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదీమిర్‌ జెలెన్స్కీ (Volodymyr Zelensky) యుద్ధోన్మాదంతో ఊగిపోయారు. ఉక్రెయిన్‌(Ukrainian)కు, రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు పలికితే అది ప్రపంచ యుద్ధానికి (World War) దారి తీస్తుందని జెలెన్స్కీ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ విషయం చైనా(China)కు కూడా తెలుసని అన్నారు. One year later, Kyiv stands. Ukraine stands. Democracy stands. […]

రష్యాకు.. చైనా మద్దతిస్తే.. ప్రపంచ యుద్ధమే! ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ వార్నింగ్‌

విధాత: సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ తనకు మద్దతు పలికేందుకు తన దేశానికి వచ్చారన్న ఆనందమో.. ఏమోగానీ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదీమిర్‌ జెలెన్స్కీ (Volodymyr Zelensky) యుద్ధోన్మాదంతో ఊగిపోయారు. ఉక్రెయిన్‌(Ukrainian)కు, రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు పలికితే అది ప్రపంచ యుద్ధానికి (World War) దారి తీస్తుందని జెలెన్స్కీ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ విషయం చైనా(China)కు కూడా తెలుసని అన్నారు.

‘మాకు సంబంధించినత వరకు ఈ యుద్ధంలో రష్యా(Russia)కు చైనా మద్దతు ఇవ్వకూడదు. నిజానికి వారు (చైనా) మా పక్షాన ఉండాలని కోరుకుంటున్నాను’ అని జెలెన్స్కీ ఒక మీడియా సంస్థతో అన్నారు. అదే సమయంలో చైనా తమకు మద్దతు ఇస్తుందని అనుకోవడం లేదనీ వ్యాఖ్యానించారు. అయితే.. అసలు ఇక్కడ ఏం జరుగుతున్నదో చైనా ఆచరణాత్మక అంచనా వేసుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

చైనా కనుక రష్యా వెంట నిలిస్తే అది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని, ఆ విషయం చైనాకు కూడా తెలుసని అన్నారు. ఆమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ (Joe Biden) ఉక్రెయిన్‌ పర్యటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కీవ్‌ నగరానికి ఆకస్మికంగా వచ్చిన బిడెన్‌.. 500 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను, మందుగుండు సామగ్రిని ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం మొదలై ఏడాది పూర్తికానున్నది.

ఈ సమయంలో కీవ్‌కు వచ్చిన బిడెన్‌.. దాదాపు ఐదు గంటలపాటు గడిపారు. ఉక్రెయిన్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘సంవత్సరం గడుస్తున్నాకీవ్‌ నిలబడే ఉన్నది.. ఉక్రెయిన్‌ నిలబడే ఉన్నది.. ప్రజాస్వామ్యం నిలబడే ఉన్నది.. అమెరికన్లు మీ వెంటే నిలబడి ఉన్నారు. అంతేకాదు యావత్‌ ప్రపంచం మీ వెంట ఉన్నది’ అని బిడెన్‌ వ్యాఖ్యానించారు.