ఖరీఫ్ నుంచి పంటల బీమా
అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.

- 9 జిల్లాల్లో నష్టం జరిగింది
- రైతులను ఆదుకుంటాం
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
విధాత: అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయశాఖ అధికారులతో పంట నష్టం వివరాలను తెప్పించాలని ఆదేశించారన్నారు. ఆ వివరాలు రాగానే పరిహారంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు బుధవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.
అకాల వర్షాలకు 9 జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఎక్కువగా కామారెడ్డిలో నష్టం జరిగిందన్నారు. సాధ్యమైనంత మేరకు రైతులను ఆదుకుంటామన్నారు. రైతు బంధు ఇప్పటికే 80 శాతం మందికి అందిందన్నారు. బీఆరెస్ వాళ్లకు ఉద్యోగం లేదు కాబట్టి మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని చిన్నారెడ్డి ఎద్దేవా చేశారు. నిరంజన్ రెడ్డి..కేటీఆర్ కి ఉద్యోగం లేదని… ఇప్పుడు మమ్మల్ని తిట్టడమే ఉద్యోగం వాళ్లకు ఉద్యోగమన్నారు.