Chiranjeevi | చిరంజీవి సీరియల్‌లో నటించారన్న విషయం మీకు తెలుసా?
Chiranjeevi | కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా, హీరోల పక్కన పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా మారి తనదైన టాలెంట్‌తో చిరు మెగాస్టార్‌గా మారారనేది అందరికి తెలిసిన విషయమే. చాలా మంది హీరోల మాదిరిగా చిరంజీవి కూడా కెరీర్ మొదట్లో సీరియల్స్ చేశారట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హిందీ సీరియల్ లో నటించారట మెగాస్టార్. బాగా పాపులర్ అయిన రజనీ అనే బాలీవుడ్ సీరియల్ లో గెస్ట్ రోల్ పోషించిన చిరంజీవి ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు […]

Chiranjeevi |
కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా, హీరోల పక్కన పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా మారి తనదైన టాలెంట్‌తో చిరు మెగాస్టార్‌గా మారారనేది అందరికి తెలిసిన విషయమే. చాలా మంది హీరోల మాదిరిగా చిరంజీవి కూడా కెరీర్ మొదట్లో సీరియల్స్ చేశారట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హిందీ సీరియల్ లో నటించారట మెగాస్టార్. బాగా పాపులర్ అయిన రజనీ అనే బాలీవుడ్ సీరియల్ లో గెస్ట్ రోల్ పోషించిన చిరంజీవి ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నారు.
ఇక సినిమాలలో బిజీ కావడంతో సీరియల్స్ వదిలేశారట. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం చిరంజీవి నటించిన సీరియల్ కోసం తెగ వెతికేస్తున్నారు. కాగా, చిరంజీవి లాగే సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయిన నటులు చాలా మంది ఉండగా, హీరో యష్ ట్రెండింగ్‌లో మొదటి స్థానం దక్కించుకున్నాడు.
ఇక చిరంజీవి ఇప్పటికీ కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. ఆయన వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే చిత్రం చేయగా, భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది.
ఈ సినిమా పరాజయంపై చిరంజీవి ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. తర్వాతి సినిమాల విషయంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తన 156, 157వ సినిమాలను వరుసగా కళ్యాణ్ కృష్ణ, వశిష్టల దర్శకత్వంలో చేయనున్నారు చిరంజీవి.
భోళా శంకర్ తరువాత చిరంజీవి ఎలాంటి సినిమాలు చేస్తాడని అంతా ఎదురుచూస్తున్న సమయంలో… యూవీ క్రియేషన్స్‌తో వశిష్ట చేసే ఈ సినిమా అప్డేట్‌ను చిరు బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేశారు. ఈ విశ్వానికి అవతల చిరంజీవిని చూపించబోతోన్నారట.. అంటే కొత్త ప్రపంచాన్ని, విశ్వాన్ని వశిష్ట క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తోంది.
ఈ పంచభూతాలు కలిస్తేనే మెగాస్టార్ అన్నట్టుగా కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా, పోస్టర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటూ అభిమానులు సైతం చిరంజీవిని రిక్వెస్ట్ చేస్తున్నారు.