Indigo flight cancellations| ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!

దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీస్ ల రద్దులో విమానాశ్రయాల్లో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా ఇండిగో విమాన సర్వీస్ లకు అంతారాయం కల్గడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు. ఒక్కరోజునే 90చోట్లకు దాదాపుగా 1000సర్వీస్ లు రద్దయిపోవడం సమస్య తీవ్రతకు నిదర్శనం.

Indigo flight cancellations| ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీస్ ల(Indigo flight cancellations) రద్దులో విమానాశ్రయాల్లో ప్రయాణికుల కష్టాలు(Passenger Problems) కొనసాగుతున్నాయి. వరసుగా నాలుగో రోజు కూడా ఇండిగో విమాన సర్వీస్ లకు అంతారాయం కల్గడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు. ఒక్కరోజునే 90చోట్లకు దాదాపుగా 1000సర్వీస్ లు రద్దయిపోవడం సమస్య తీవ్రతకు నిదర్శనం. ముంబై ఎయిర్ పోర్టులో 109 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి 106, బెంగళూరు 124, ముంబై 109, పూణే నుంచి 42 సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను రద్దు చేశారు.

ముంబైలో ఇండిగో సిబ్బందితో ఆఫ్రికన్ మహిళ గొడవ పడింది. ఇండిగో కౌంటర్ పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ గామారింది. నిన్న ఓ నవవధువుల జంట విమానాశ్రయం నుంచే ఆన్ లైన్ లో పెళ్లి రిసెప్షన్ జరుపుకున్న వీడియో సైతం వైరల్ అయ్యింది. ఓ విమానాశ్రయంలో తన కూతురుకు పిరియడ్స్ వచ్చాయని, శానిటరీ ప్యాడ్స్ కావాలని ఓ జవాన్ ఇండిగో సిబ్బందిని వేడుకోవడం..ఇక్కడ అలాంటివేవి లేవని సిబ్బంది సమాధానం ఇచ్చిన వీడియో కూడా ప్రయాణికుల ఇక్కట్లకు అద్దం పట్టింది. మరోవైపు ఇండిగో విమాన సర్వీస్ లు రద్దు కావడంతో ప్రయాణికుల రూ.7వేల నుంచి 10వేల టికెట్ ను రూ.50వేల నుంచి 60వేలు పెట్టి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. తమకు ఇన్నికష్టాలు పెట్టిన ఇండిగో విమాన సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండిగో విమానయాన సర్వీస్ ల పునరుద్దరణలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.

ఇండిగో విమాన సర్వీస్ ల సమస్యలు ఈ నెల 15లోగా పరిష్కారం అవుతాయని ఇండిగో సీఈవో వెల్లడించారు. సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే విమానాల్ని రద్దు చేశామని, డీజీసీఏ కూడా నిబంధనలు మార్చడం సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. సిస్టమ్‌ రీబూట్‌ వల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తుందని సీఈవో తెలిపారు.

సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం

1,000 కి పైగా ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(Supreme Court PIL) దాఖలైంది. పిటిషనర్లు సీజేఐ నివాసాన్ని సంప్రదించి..తమ వ్యాజ్యంపై తక్షణ విచారణ కోరారు. సుప్రీంకోర్టు కూడా ఇండిగో విమానాల సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈరోజు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి వీలుగా పిటిషనర్ తరపు న్యాయవాదిని అత్యవసర విచారణ కోసం సీజేఐ తన ఇంటికి పిలిపించడం విశేషం.