Chiru- Balayya | మ‌రోసారి నంద‌మూరి-మెగా వార్… ప్రీ–రిలీజ్ బిజినెస్‌లో ఎవరి దూకుడు ఎంత ఉంది?

Chiru- Balayya | టాలీవుడ్‌లో ఇద్దరు అగ్రశ్రేణి స్టార్లు బాలకృష్ణ , చిరంజీవి ఒకే సీజన్‌లో తమ సినిమాలతో రాబోతుండటంతో ఇండస్ట్రీలో భారీ చర్చ జరుగుతోంది. మొదట ఇద్దరూ సంక్రాంతి రేసులో ఢీకొంటారని అనుకున్నారు.

  • By: sn |    movies |    Published on : Nov 26, 2025 4:42 PM IST
Chiru- Balayya | మ‌రోసారి నంద‌మూరి-మెగా వార్… ప్రీ–రిలీజ్ బిజినెస్‌లో ఎవరి దూకుడు ఎంత ఉంది?

Chiru- Balayya | టాలీవుడ్‌లో ఇద్దరు అగ్రశ్రేణి స్టార్లు బాలకృష్ణ , చిరంజీవి ఒకే సీజన్‌లో తమ సినిమాలతో రాబోతుండటంతో ఇండస్ట్రీలో భారీ చర్చ జరుగుతోంది. మొదట ఇద్దరూ సంక్రాంతి రేసులో ఢీకొంటారని అనుకున్నారు. అయితే ప్లాన్స్ మారడంతో బాలయ్య నటించిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా, చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ రెండు సినిమాల విడుదలకు ఐదు వారాల గ్యాప్ ఉన్నా… సోషల్ మీడియాలో వీరిద్దరి చిత్రాల ప్రీ–రిలీజ్ రేంజ్, బజ్, అంచనాలపై భారీగా పోలికలు మొదలయ్యాయి.

కరోనా తర్వాత థియేటర్లకు జోష్ తీసుకొచ్చిన బాలయ్య బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారుగా ₹120 కోట్ల ప్రీ–రిలీజ్ బిజినెస్ సాధించినట్లు ట్రేడ్ టాక్. నైజాం – ₹42 కోట్లు, ఆంధ్రా – ₹55 కోట్లు, ఓవర్సీస్ – ₹15 కోట్లు అమ్ముడవడం సింగిల్ హీరో సినిమాకు పెద్ద అచీవ్‌మెంట్‌గానే భావిస్తున్నారు. అయితే ‘జాజికాయ’ సాంగ్‌పై వచ్చిన ఫ్లాట్ రెస్పాన్స్, తమన్ సంగీతం రొటీన్‌గా ఉందన్న కామెంట్స్, ట్రైలర్‌లో కొత్తదనం కొరవడటం ఇవన్నీ మిక్స్‌డ్ బజ్‌కు కారణమయ్యాయి. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రాకపోతే ₹120 కోట్ల రికవరీ కష్టమని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

మ‌రోవైపు… చిరంజీవి చాలా గ్యాప్ త‌ర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న‌‘మన శంకరవరప్రసాద్ గారు’ తో సంక్రాంతికి సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు ₹160–₹175 కోట్ల మధ్య ప్రీ–రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇందులో నైజాం – ₹40 కోట్లు, ఆంధ్రా – ₹70 కోట్లు, సీడెడ్ – ₹25 కోట్లు, ఓవర్సీస్ – ₹18 కోట్లు వంటి భారీ డీల్స్ క్లోజ్ అయ్యాయి. ‘మీసాల పిల్ల’ పాటకు వచ్చిన భారీ రెస్పాన్స్, చిరంజీవి రీఎంట్రీ ఫీలింగ్, అనిల్ రావిపూడి బ్రాండ్ ఎంటర్‌టైన్మెంట్‌పై ప్రేక్షకుల నమ్మకం అన్ని కలిసి చిత్రానికి మాస్ బజ్‌ను పెంచాయి. మొత్తంగా చూస్తే… ప్రీ–రిలీజ్ బిజినెస్, ప్రమోషన్స్ విషయంలో ప్రస్తుతం చిరంజీవి టాప్‌లో ఉండగా, బాక్సాఫీస్ వద్ద చివరకు ఎవరు సత్తా చాటుతారన్నది మాత్రం డిసెంబర్ 5 నుంచి మొదలయ్యే రేసే తేల్చనుంది!