దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో క్రిస్మస్: మంత్రి హరీశ్‌రావు

విధాత,మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి ఆత్మబంధువులని, పేదలకు సాయం చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ విధి అని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సీఎస్ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జరిపిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తో కలిసి హాజరయ్యారు. ఈ […]

  • By: krs |    latest |    Published on : Dec 25, 2022 4:57 AM IST
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో క్రిస్మస్: మంత్రి హరీశ్‌రావు

విధాత,మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి ఆత్మబంధువులని, పేదలకు సాయం చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ విధి అని మంత్రి తెలిపారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సీఎస్ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జరిపిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తో కలిసి హాజరయ్యారు. ఈ మేరకు కేక్ కట్ క్రైస్తవ ఫాస్టర్లకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు తినిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం బీఆర్ఏస్ అని పేర్కొన్నారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్నీ కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని తెలిపారు.

పేద ప్రజలకు సాయం చేయడం ప్రభుత్వాల విధిగా చెబుతూ.. పేదలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆత్మబంధువులని పేర్కొన్నారు. సిద్ధిపేట సీఎస్ఐ చర్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు.