SBI ATM Theft In Koti : పోలీసులకు సవాల్ గా మారిన కోఠి కాల్పుల కేసు
హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్‌పై కాల్పులు, రూ.6లక్షల నగదు దొంగతనం, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విధాత, హైదరాబాద్ : కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో తుపాకీ కాల్పుల ఘటన పోలీసులకు సవాల్ గా మారింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం నగదు డిపాజిట్ కు ఏటీఎం వద్దకు వచ్చిన రషీద్ అనే వ్యక్తిపై దుండుగులు తుపాకితో కాల్పులు జరిపి రూ.6లక్షల నగదు ఎత్తుకేళ్లారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు స్థానికులు చూస్తుండగానే జరిపిన కాల్పులలో రిషద్ కాలికి తూటా గాయమైంది.అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల సహాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పక్కా ముందస్తు వ్యూహంతోనే దాడి ?
బ్లాక్ కలర్ స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండుగులు రషీద్ పై కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది తెలిసిన వాళ్ల పనేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రషీద్ ఉదయం 7 గంటలకే ఏటీఎం వద్దకు నగదు డిపాజిట్ కోసం వస్తాడని దుండగులకు ముందే తెలిసి ఉండవచ్చని, నగదు డిపాజిట్ చేసే సమయం, పారిపోయేందుకు రూట్ మ్యాప్ ముందే సిద్ధం చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ముందే రెక్కీ నిర్వహించారా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రషీద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. కాల్పులకు పాల్పడిన నిందితులు తప్పించుకోలేరని దర్యాప్తు అధికారి డీసీసీ శిల్పవల్లి తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గాల్వాన్ అమరవీరుడి మాతృమూర్తి
Silver Gold Price Today : వేలల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram