ఈ నెల 14న జగిత్యాలకు కేసీఆర్.. అంజన్న ఆలయ క్షేత్ర అభివృద్ధిపై చర్చ
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరర్‌రావు ఈ నెల 14న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇటీవల ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లోనూ కేటాయింపులు చేసింది. ఈ క్రమంలో 14న సీఎం కేసీఆర్ ఆలయానికి చేరుకొని ఆలయ అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చించి, అనంతరం పూర్తి వివరాలు […]

CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరర్‌రావు ఈ నెల 14న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇటీవల ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లోనూ కేటాయింపులు చేసింది. ఈ క్రమంలో 14న సీఎం కేసీఆర్ ఆలయానికి చేరుకొని ఆలయ అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చించి, అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
సీఎం ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి ఆదివారం కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను రూపొందించి.. కేసీఆర్‌కు అందజేయనున్నారు. ఇదిలా ఉండగా.. జగిత్యాల జిల్లాలో డిసెంబర్‌లో కేసీఆర్ పర్యటించిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇటీవల రూ.100కోట్లు విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.