Revanth Reddy vs KTR: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్.. చిట్ చాట్ వార్!
ఈసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ లో ఏం ఉండని నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఫార్ములా ఈ రేసు కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని..అరెస్టు ప్రచారం చేస్తారని కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆ వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. కేటీఆర్ ఓ పిచ్చోడు ఏదేదో మాట్లాడుతాడని..క్రిమినల్స్ కు కేసులంటే భయం ఉండదన్నారు. భయపడేవాడు నేరాలు చేయడని.. చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్టు అన్నారు.

Revanth Reddy vs KTR : తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య చిట్ చాట్ వార్ కు వేదికైంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ లో ఏం ఉండని నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఫార్ములా ఈ రేసు కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని..అరెస్టు ప్రచారం చేస్తారని కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు.
దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆ వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. కేటీఆర్ ఓ పిచ్చోడు ఏదేదో మాట్లాడుతాడని..క్రిమినల్స్ కు కేసులంటే భయం ఉండదన్నారు. భయపడేవాడు నేరాలు చేయడని.. చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్టు అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లకు బలుపు తప్ప ఏం లేదన్నారు. పదేళ్ల పాలనలో తండ్రీ కొడుకులు చేసింది అప్పులు తప్పులు తప్ప ఏమి లేదన్నారు. కేసీఆర్ ను రాజకీయంగా బండకేసి కొట్టి సీఎం అయ్యానన్నారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే అర్హతే లేదన్నారు.
రాష్ఱ్రానికి కేంద్ర నిధులపై కిషన్ రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. నేను, భట్టి విక్రమార్క వస్తామన్నారు. కేంద్రం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నందున అడుగుతున్నామన్నారు. బడ్జెట్ లో పరిమిత కేటాయింపులు ఉంటాయని.. సదరన్ పార్టీకి నిధులు ఎవరిస్తారో కిషన్ రెడ్డికి తెలియదా అని.. రింగ్ ఉంటేనే రింగ్ రోడ్డు అంటారని..సగం చేసి రింగురోడ్ అంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పెరడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ చెప్పిన మాట నిలబెట్టుకుని రాష్ఖ్రానికి నిధులివ్వాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో లేదని.. భూసేకరణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి పాటిస్తుందని.. భూసేకరణ చేయట్లేదని అంటారు..వద్దని కూడా వాళ్లే అంటారని చురకలేశారు. భూసేకరణ వద్దని ఈటెల, లక్ష్మణ్ లు ఆందోళన చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ సమస్య అంటున్నాడని..చర్చిద్ధామంటే భట్టి విక్రమార్క పెట్టిన ఎంపీల భేటీకి రాలేదని..నేను సెక్రటేరియట్ కి పిలిచిన రాలేదని విమర్శించారు. మేము కులగణణ చేశాక ఇక అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చాయని గుర్తుచేశారు. కేంద్ర నిధుల సాధనకు 39 సార్లు కాదు 99 సార్లు ఢిల్లీకి వెలుతామని..తెలంగాణకు ఏం తేవద్దని బీఆర్ఎస్ చూస్తుందని ఆరోపించారు. సందర్భం వస్తే రాష్ట్ర డిమాండ్ల కోసం ఆమరణ దీక్ష చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు : కేటీఆర్
అంతకుముందు కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ హాజరవుతారన్నారు. అయితే కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరని..వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, కారు కూతలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది ఆయన ఆలోచన అన్నారు. ఈ పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి ఒక కొడుకుగా , ఒక పార్టీ ఎమ్మెల్యేగా కేసిఆర్ రావొద్దు అనేది నా అభిప్రాయమన్నారు.
ఇక బడ్జెట్ లో ఏం ఉండని నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా 16న బడ్జెట్ పెట్టీ, 17న నాకు ఈ ఫార్మూలా రేసు కేసులో నోటీసులు ఇచ్చి నన్ను మళ్ళీ విచారణకు పిలుస్తారని..ప్రతి బడ్జెట్ సందర్భంగా ఇది ఉండేదనని కేటీఆర్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ లొట్టపీసు కేసు అని..ఈ కార్ రేస్ కేసు వల్ల ఏం లాభం జరిగిందో నేను చెప్తానన్నారు. 200 కోట్లు పెట్టీ ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నారని..
దీనివల్ల లాభం ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇంకా ఈ మొగోడు రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ పెడుతానంటున్నాడని.. దానికి లక్ష కోట్లు కావాలన్న సంగతి తెల్వనట్లుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ రావడానికి ముందు పడింది ఎవరో అందరికీ తెలుసని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీని మంచోడు అనకపోతే రేవంత్ రెడ్డిని జైల్లో వేస్తాడని.. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా..ఆయన నిస్సహాయుడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారన్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని..టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. వందల వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారన్నారు.
శ్రవణ్ ను 2023 లో నామినేట్ చేశామని.. అప్పుడు బీజేపీ గవర్నర్ తమిళిసై ద్వారా ఆపిందని..అందుకే కేసీఆర్ మళ్ళీ గుర్తించి అవకాశం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో నడవటం లేదని..కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. అందుకే ఆయనది నడవటం లేదని..ఎక్కే విమానం దిగె విమానం తప్ప రేవంత్ రెడ్డి చేసేది ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు.