జర జాగ్రత్త.. మరో నాలుగైదు రోజులు చలి చంపేయనుంది..
Cold Weather | తీవ్రమైన శీతల గాలులతో తెలంగాణ రాష్ట్రం గజ గజ వణికిపోతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. ఈ పరిస్థితి మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పిల్లలకు, వృద్ధులకు వెచ్చని దుస్తులతో రక్షణ కల్పించాలని సూచించారు. తెలంగాణ, […]

Cold Weather | తీవ్రమైన శీతల గాలులతో తెలంగాణ రాష్ట్రం గజ గజ వణికిపోతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. ఈ పరిస్థితి మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పిల్లలకు, వృద్ధులకు వెచ్చని దుస్తులతో రక్షణ కల్పించాలని సూచించారు.
తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాబోయే నాలుగైదు రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో 20వ తేదీ వరకు 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
మంచు, పొగమంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులు పొలాల్లోకి వెళ్లే ముందు టార్చ్ లైట్ ఉపయోగించాలి. హైవేలపై వెళ్లేవారికి పొగమంచు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. జాతీయ రహదారులపై అతి తక్కువ విజిబిలిటీ ఉండే అవకాశం ఉంది.