Congress | రాజ్యాంగ ప్ర‌తిలో.. సెక్యుల‌ర్‌, సోష‌లిస్టు ప‌దాలు తీసేశారు: కాంగ్రెస్

Congress విధాత‌: నూత‌న పార్లమెంటు భ‌వ‌నానికి విచ్చేసిన సంద‌ర్భంగా ఎంపీల‌కు ఇచ్చిన రాజ్యాంగ ప్ర‌తిపై వివాదం రేగుతోంది. త‌మ‌కు ఇచ్చిన రాజ్యాంగ ప్ర‌తిలో సోష‌లిస్టు (Socialist) , సెక్యుల‌ర్ (Secular) ప‌దాలు లేవ‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ పీఠిక‌లో 42వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా చేర్చిన సోష‌లిస్టు, సెక్యుల‌ర్ ప‌దాలు లేవ‌ని లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ (Congress) నాయ‌కుడు ఆధిర్ రంజ‌న్ చౌద‌రి పేర్కొన్నారు. మైనారిటీల ర‌క్ష‌ణ కోసం, కొద్ది మంది ధ‌న‌వంతుల చేతిలోనే […]

Congress | రాజ్యాంగ ప్ర‌తిలో.. సెక్యుల‌ర్‌, సోష‌లిస్టు ప‌దాలు తీసేశారు: కాంగ్రెస్

Congress

విధాత‌: నూత‌న పార్లమెంటు భ‌వ‌నానికి విచ్చేసిన సంద‌ర్భంగా ఎంపీల‌కు ఇచ్చిన రాజ్యాంగ ప్ర‌తిపై వివాదం రేగుతోంది. త‌మ‌కు ఇచ్చిన రాజ్యాంగ ప్ర‌తిలో సోష‌లిస్టు (Socialist) , సెక్యుల‌ర్ (Secular) ప‌దాలు లేవ‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ పీఠిక‌లో 42వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా చేర్చిన సోష‌లిస్టు, సెక్యుల‌ర్ ప‌దాలు లేవ‌ని లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ (Congress) నాయ‌కుడు ఆధిర్ రంజ‌న్ చౌద‌రి పేర్కొన్నారు.

మైనారిటీల ర‌క్ష‌ణ కోసం, కొద్ది మంది ధ‌న‌వంతుల చేతిలోనే సంప‌ద పోగుప‌డ‌కుండా ఉండ‌టం కోస‌మ‌ని పేర్కొంటూ ఎమ‌ర్జెన్సీ విధించిన స‌మ‌యంలో అప్పటి ప్ర‌ధాని ఇందిర ఈ రెండు ప‌దాల‌నూ చేర్చారు. తాజాగా సోష‌లిస్టు, సెక్యుల‌ర్ ప‌దాల‌ను మోదీ ప్ర‌భుత్వం కావాల‌నే రాజ్యాంగ ప్ర‌తుల నుంచి తొల‌గించింద‌ని ఆధిర్ ఆరోపించారు.

ఈ విష‌యంపై స‌భలో మాట్లాదామ‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అవ‌కాశం ఇవ్వ‌లేద‌న్నారు. ఈ వివాదంపై న్యాయ‌శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివ‌ర‌ణ ఇచ్చారు. పార్ల‌మెంటు బ‌య‌ట ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రూపొందించిన‌పుడు ఇప్పుడు మేము ఏమైతే ప్ర‌తులు ఎంపీల‌కు ఇచ్చామో అవే వివ‌రాల‌తో ఉంది. 42వ స‌వ‌ర‌ణ అనేది త‌ర్వాత వ‌చ్చింది. మేము ఇచ్చింది మొద‌టి ప్ర‌తి అని పేర్కొన్నారు.

రాజ్యాంగంలో ఎందుకు లేవు ?

సెక్యుల‌రిజం, సోష‌లిజంల‌పై డ్రాఫ్టింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ అంబేడ్క‌ర్‌, తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూల‌కు భిన్న‌మైన అభిప్రాయాలు ఉండేవి. ఈ రెండు భావ‌న‌లు ప్ర‌జ‌ల్లో స‌హ‌జ‌సిద్ధంగా ఉండాల‌ని అంబేడ్కర్ భావించ‌గా.. మైనారిటీల ర‌క్ష‌ణ‌కు ఈ ప‌దాల‌ను చేర్చాల‌ని నెహ్రూ భావించారు. అయితే ఏకాభిప్రాయం లేక‌పోవ‌డంతో వీటిని రాజ్యాంగంలో చేర్చ‌కుండా ప‌క్క‌న‌పెట్టారు.

సెక్యుల‌రిజం అనే ప‌దాన్ని చేర్చ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆర్టిక‌ల్ 25, 26, 27ల‌ను మైనారిటీల హ‌క్కుల చేర్చిన మూలంగా మ‌న రాజ్యాంగం సెక్యులరిజంను క‌లిగి ఉంద‌ని నిపుణులు చెబుతారు. అయితే ఎమర్జెన్సీ స‌మ‌యంలో పార్ల‌మెంటులో చ‌ర్చ లేకుండా భార‌త రాజ్యాంగ పీఠిక‌ను స‌ర్వ‌స‌త్తాక, ప్ర‌జాస్వామ్య గ‌ణ‌తంత్ర రాజ్యం నుంచి స‌ర్వ‌స‌త్తాక‌, సామ్య‌వాద‌, లౌకిక‌వాద‌, ప్ర‌జాస్వామ్య‌, గ‌ణ‌తంత్ర రాజ్యంగా ఇందిరాగాంధీ మార్చి వేశారు.