Manchiryala: కమీషన్ల కోసం పట్టణ నడి ఒడ్డున ఇంటిగ్రేటెడ్ మార్కెట్.. ముంపు ప్రాంతాల్లో ఆస్పత్రి: భట్టి
స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు కమీషన్ల కోసం కక్కుర్తి వ్యవహారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపణ విధాత: హాత్ సే హాత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర టాకీస్, మోర్ మార్కెట్, ఐబీ చౌరస్తా మీదుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించాల్సిన ప్రదేశంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలను సీఎల్పీ […]

- స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు కమీషన్ల కోసం కక్కుర్తి వ్యవహారం
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపణ
విధాత: హాత్ సే హాత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర టాకీస్, మోర్ మార్కెట్, ఐబీ చౌరస్తా మీదుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది.
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించాల్సిన ప్రదేశంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా కమీషన్లకు కక్కుర్తి పడి పనులు చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్‌ను గోదావరి నది సమీపంలో నిర్మించాడని, వర్షాకాలంలో వచ్చిన భారీ వర్షాలకు గోదావరి ప్రవాహంతో హాస్పిటల్ పూర్తిగా ముంపు గురైందని తెలిపారు. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సకాలంలో స్పందించి ఆసుపత్రి నుంచి బాలింతలను పసిపాపలను జనరల్ హాస్పటల్‌కు తరలించారని లేని పక్షంలో భారీ నష్టం జరిగేదని పేర్కొన్నారు.
ఐబీ చౌరస్తాలో జనరల్ హాస్పిటల్ ముందు శిశు సంక్షేమ ఆసుపత్రిని నిర్మించాలని, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు పలుమార్లు చెప్పినప్పటికీ కమీషన్ల కోసమే నగరం నడిబొడ్డున ఐబి చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మిస్తున్నాడని ఆరోపించారు.
కమీషన్లు, కాంట్రాక్టుల బిల్లుల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాపులు అమ్ముకోవడానికి ఐబి చౌరస్తాలో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు . కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎత్తివేసి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.