Viral Video | బాలుడికి పాలిచ్చిన ఆవు..

Viral Video | ఓ ఆవు అమ్మ ప్రేమ‌ను చాటుకుంది. ఆక‌లితో ఉన్న బాలుడికి పాలిచ్చి.. అమ్మ‌త‌నంలోని ఔన్న‌త్యాన్ని చాటుకుంది. ఆ బుడ్డోడు పాలు తాగుతున్నంత సేపు ఆవు ఏ మాత్రం క‌ద‌ల్లేదు. ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాలోని కోసిగి గ్రామంలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న ఓ ఆవు నిల్చుని ఉంది. దాని ద‌గ్గ‌ర‌కు మూడేండ్ల వ‌య‌సున్న ఓ బాలుడు వెళ్లాడు. ఇక ఆవు పొదుగును ప‌ట్టుకున్న బాలుడు.. పాల‌ను […]

Viral Video | బాలుడికి పాలిచ్చిన ఆవు..

Viral Video | ఓ ఆవు అమ్మ ప్రేమ‌ను చాటుకుంది. ఆక‌లితో ఉన్న బాలుడికి పాలిచ్చి.. అమ్మ‌త‌నంలోని ఔన్న‌త్యాన్ని చాటుకుంది. ఆ బుడ్డోడు పాలు తాగుతున్నంత సేపు ఆవు ఏ మాత్రం క‌ద‌ల్లేదు. ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాలోని కోసిగి గ్రామంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న ఓ ఆవు నిల్చుని ఉంది. దాని ద‌గ్గ‌ర‌కు మూడేండ్ల వ‌య‌సున్న ఓ బాలుడు వెళ్లాడు. ఇక ఆవు పొదుగును ప‌ట్టుకున్న బాలుడు.. పాల‌ను తాగేశాడు. అటు ఇటు తిరుగుతూ ఆ బుడ్డోడు పాల‌ను తాగాడు. ఈ స‌మ‌యంలో ఆవు ఆ అబ్బాయికి ఎలాంటి హానీ క‌లిగించ‌కుండా, అమ్మ ప్రేమ‌ను పంచింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.