Cyclone Biporjoy | మ‌రణం వెన్నంటే జ‌ననం.. 707 మందికి జ‌న్మ‌నిచ్చిన‌ గర్భిణులు

Cyclone Biporjoy గుజ‌రాత్‌తో బిప‌ర్ జాయ్ తుఫాన్‌ 1,152 మంది గర్భిణుల‌తో పాటు ల‌క్ష మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు విధాత‌: విధ్వంసక బిప‌ర్‌జాయ్ తుఫాన్ కార‌ణంగా మ‌హారాష్ట్రతోపాటు గుజ‌రాత్‌లోనూ ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైరిస్క్ ప్రాంతాల నుంచి 1,152 మంది గర్భిణుల‌ను కూడా త‌ర‌లించారు. ఈ గ‌ర్భిణులు 707 మంది […]

  • By: krs    latest    Jun 17, 2023 8:56 AM IST
Cyclone Biporjoy | మ‌రణం వెన్నంటే జ‌ననం.. 707 మందికి జ‌న్మ‌నిచ్చిన‌ గర్భిణులు

Cyclone Biporjoy

  • గుజ‌రాత్‌తో బిప‌ర్ జాయ్ తుఫాన్‌
  • 1,152 మంది గర్భిణుల‌తో పాటు ల‌క్ష మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు

విధాత‌: విధ్వంసక బిప‌ర్‌జాయ్ తుఫాన్ కార‌ణంగా మ‌హారాష్ట్రతోపాటు గుజ‌రాత్‌లోనూ ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

హైరిస్క్ ప్రాంతాల నుంచి 1,152 మంది గర్భిణుల‌ను కూడా త‌ర‌లించారు. ఈ గ‌ర్భిణులు 707 మంది శిశువులకు జన్మనిచ్చారు. బిపర్ జాయ్ తుఫాన్ సందర్భంగా పండంటి పిల్లలు జన్మించడంతో వారికి కొందరు బిపర్ జాయ్ అంటూ పేర్లు పెట్టుకొని సంతోష ప‌డ్డారు.

కచ్ జిల్లాలో దాదాపు 348 మంది, రాజ్‌కోట్‌లో వంద మంది, దేవభూమి ద్వారకలో 93, గిర్ సోమనాథ్‌లో 69, పోర్‌బందర్‌లో 30, జునాగఢ్‌లో 25, జామ్‌నగర్‌లో 17, రాజ్‌కోట్ మహానగర్‌పాలికలో 12, ​​జునాగఢ్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎనిమిది జననాలు నమోదయ్యాయి. మునిసిపల్ కార్పొరేషన్, మోర్బి జిల్లాలో ఒకరు చొప్పున జ‌న్మించారు.

తుఫాను గురువారం సాయంత్రం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో తీరాన్ని తాకింది. 1,09,000 మంది తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించారు. తుఫాన్ తీరం దాటే ముందు ముందు బలమైన గాలుల కారణంగా చెట్టు పడిపోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారని NDRF డైరెక్టర్ జనరల్ (డిజి) అతుల్ కర్వాల్ శుక్రవారం తెలిపారు. తుఫాను కారణంగా 23 మంది గాయపడ్డారు.