Dalai Lama | నా నాలుక‌ను తాకుతావా..? బాలుడిని కోరిన దలైలామా.. వీడియో

Dalai Lama | టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా( Dalai Lama ) మ‌రోసారి విమర్శ‌ల పాల‌య్యారు. త‌న నాలుక‌ను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని ద‌లైలామా కోర‌డం తీవ్ర వివాద‌స్ప‌ద‌మైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దలైలామా వ‌ద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు ఓ బాలుడు వ‌చ్చాడు. దీంతో బాలుడిని ద‌లైలామా ద‌గ్గ‌ర‌కు తీసుకుని అత‌ని పెద‌వుల‌పై ముద్దు పెట్టారు. ఒక రెండు క్ష‌ణాలు ఆగిన త‌ర్వాత ద‌లైలామా త‌న నాలుక‌ను […]

Dalai Lama | నా నాలుక‌ను తాకుతావా..? బాలుడిని కోరిన దలైలామా.. వీడియో

Dalai Lama | టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా( Dalai Lama ) మ‌రోసారి విమర్శ‌ల పాల‌య్యారు. త‌న నాలుక‌ను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని ద‌లైలామా కోర‌డం తీవ్ర వివాద‌స్ప‌ద‌మైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

దలైలామా వ‌ద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు ఓ బాలుడు వ‌చ్చాడు. దీంతో బాలుడిని ద‌లైలామా ద‌గ్గ‌ర‌కు తీసుకుని అత‌ని పెద‌వుల‌పై ముద్దు పెట్టారు. ఒక రెండు క్ష‌ణాలు ఆగిన త‌ర్వాత ద‌లైలామా త‌న నాలుక‌ను బ‌య‌ట‌పెట్టి.. నీ నోటితో నా నాలుక‌ను తాకుతావా అని అడిగారు. ఈ మాట‌లు ఆ వీడియోలో వినిపించాయి.

ద‌లైలామా తీరుపై నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న‌ను స‌హించే ప్ర‌స‌క్తే లేద‌ని, ద‌లైలామాను అరెస్టు చేయాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. దలైలామా ఎందుకు అలా చేశారని కొందరు ప్రశ్నించ‌గా, మైనర్‌ బాలుడి పట్ల ఆయన చర్యను ఎవరూ సమర్థించబోరని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. అయితే బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ఆచారం కావచ్చని మ‌రికొందరు అభిప్రాయపడ్డారు.

2019లో బ్రిటీష్ టీవీకి ఇంట‌ర్వ్యూ ఇస్తూ.. ద‌లైలామా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఒకవేళ తదుపరి దలైలామా మహిళ అయితే ఆమె మరింత ఆకర్షణీయంగా ఉండాలని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన ఆ తర్వాత తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.