తొమ్మిదో రోజూ.. ఎమ్మెల్యేల ఇంటి ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

తొమ్మిదో రోజూ.. ఎమ్మెల్యేల ఇంటి ఎదుట ఆశా వర్కర్ల ధర్నా
  • తొమ్మిదో రోజూ కొనసాగిన సమ్మె


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తొమ్మిది రోజులుగా ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం హనుమకొండ లోని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.


అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం ప్రజాప్రతినిధుల ఇంటి ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఇంట్లోకి చొచ్చుక పోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బారికేడ్లు పెట్టి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.