ఆ ఆపరేషన్ చేయించుకున్న భార్య.. ఇంటి నుంచి గెంటేసిన భర్త..
Odisha | ఓ ఇద్దరు దంపతులు ఇప్పటికే పది మంది పిల్లలను కన్నారు. పదకొండో కాన్పులో బిడ్డ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్తలు.. ఆమెకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించారు. దీంతో భర్త భగ్గుమన్నాడు. ఇంటి నుంచి భార్యను గెంటేశాడు. ఈ ఘటన ఒడిశాలోని కేంఝర్ జిల్లా డిమిరియా గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. డిమిరియా గ్రామానికి చెందిన రవి దెహురి, జానకి దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. అయితే ఈ […]

Odisha | ఓ ఇద్దరు దంపతులు ఇప్పటికే పది మంది పిల్లలను కన్నారు. పదకొండో కాన్పులో బిడ్డ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్తలు.. ఆమెకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించారు. దీంతో భర్త భగ్గుమన్నాడు. ఇంటి నుంచి భార్యను గెంటేశాడు. ఈ ఘటన ఒడిశాలోని కేంఝర్ జిల్లా డిమిరియా గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. డిమిరియా గ్రామానికి చెందిన రవి దెహురి, జానకి దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. అయితే ఈ దంపతులిద్దరూ ఇప్పటికే 10 మంది పిల్లలను కన్నారు. ఇటీవలే ఆమె పదకొండో సారి గర్భం దాల్చింది. ప్రసవ సమయంలో బిడ్డ చనిపోయాడు. జానకి కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. జానకి విషయం ఆశా వర్కర్స్‌కు తెలిసింది. దీంతో ఆమెను ఒప్పించి, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించారు.
భగ్గుమన్న భర్త.. ఇంటి నుంచి గెంటేశాడు..
తన భార్య పిల్లలు కాకుండా కుటుంబ నియంత్రణ చేసుకోవడంపై భర్త రవి భగ్గుమన్నాడు. భార్యను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశాడు. ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. మారణాయుధాలతో ఇంటి గడప వద్ద కాపలా కాస్తున్నాడు. పితృదేవతలకు పూజలు చేయడానికి అనర్హురాలివ్వయ్యావంటూ తీవ్రంగా మండిపడ్డాడు. రవికి ఆశా కార్యకర్తలు, ఆరోగ్య అధికారులు నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు. రవిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.