TELANGANA | సమగ్ర శిక్ష ఉద్యోగుల అసెంబ్లీ ముట్టడి భగ్నం అరెస్టులు..ఉద్రిక్తత
తమ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి..ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ధ తలపెట్టిన ధర్నాలలను పోలీసులు భగ్నం చేశారు

కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్ల మెరుపు ధర్నా
గ్రామ పంచాయతీ వర్కర్ల నిరసన అడ్డగింత
విధాత, హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి..ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ధ తలపెట్టిన ధర్నాలలను పోలీసులు భగ్నం చేశారు. ముందుగా తమ సమస్యల సాధనకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ అమలుకు డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగులు అసెంబీ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఈ సందర్భం ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే తమను పర్మినెంట్ చేస్తామని మాట ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవట్లేదంటూ ఆరోపించారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం ఏర్పడిన నెలకే పర్మనెంట్ చేస్తామని చెప్పిందని, ఇప్పటివరకు మమ్మల్ని పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కనీసం వేతనంతో సహా ఉద్యోగ పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
కోఠి చౌరస్తాలో ఆశ వర్కర్ల మెరుపు ధర్నా
తమ డిమాండ్ల సాధనకు ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నా కోసం ఇందిరాపార్కు వద్ధకు వెలుతున్న ఆశావర్కర్లను వేల సంఖ్యలో కోటి చౌరస్తాలో పోలీసులు అడ్డుకుని ఆపివేశారు. దీంతో అక్కడే ఆశా వర్కర్లు మెరుపు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తమ సమస్యలు తీర్చే వరకు వెళ్ళేది లేదని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అటు గ్రామపంచాయతీ కార్మికులు ధర్నాను సైతం పోలీసులు ఎక్కడివారినక్కడే అడ్డుకుని అరెస్టులు చేసి భగ్నం చేశారు.