Ind vs Pak: భార‌త్- పాక్ మ్యాచ్..10 సెకన్లకు రూ.30 లక్షల రూపాయ‌లా..!

Ind vs Pak: చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు భార‌త్ - పాకిస్తాన్ చాలా రోజుల త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పోటీ ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 15న దాయాదుతో అహ్మదాబాద్‌లో భార‌త్ ఫైట్ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భాగంగా ఇప్పటికే అభిమానులు హోటల్‌ రూమ్‌లు, విమాన టిక్కెట్లు భారీ మొత్తంలో బుక్‌ చేసుకున్నారు. కాని అక్టోబర్ 15 నుండి […]

  • By: sn    latest    Jul 27, 2023 7:13 AM IST
Ind vs Pak: భార‌త్- పాక్ మ్యాచ్..10 సెకన్లకు రూ.30 లక్షల రూపాయ‌లా..!

Ind vs Pak: చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు భార‌త్ – పాకిస్తాన్ చాలా రోజుల త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పోటీ ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 15న దాయాదుతో అహ్మదాబాద్‌లో భార‌త్ ఫైట్ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భాగంగా ఇప్పటికే అభిమానులు హోటల్‌ రూమ్‌లు, విమాన టిక్కెట్లు భారీ మొత్తంలో బుక్‌ చేసుకున్నారు. కాని అక్టోబర్ 15 నుండి దీపావళి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు భద్రత త‌లెత్తే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి, ఈ మ్యాచ్ ని ముందు రోజుకి మార్చేందుకు ఐసీసీతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఇప్పుడు ఈ మ్యాచ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీహాట్‌స్టార్‌లకు కాసుల వర్షం కురిపించడం ఖాయంగా క‌నిపిస్తుంది.. ఈ మెగా టోర్నీ అడ్వర్టైజమెంట్స్‌కు సంబంధించిన రేట్ కార్డ్‌ను డిస్నీ హాట్‌స్టార్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ కోసం 10 సెకన్లకు రూ.30 లక్షల రూపాయలు వసూలు చేయాలని డిస్నీహాట్‌స్టార్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌ట‌.ఇప్ప‌టికే ఐపీఎల్ 2023 సీజన్ ఓటీటీ రైట్స్ కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న డిస్నీ హాట్‌స్టార్ ఆ లోటుని ఇలా తీర్చుకోవాల‌ని అనుకుంటుందట‌.

ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ఫ్రీగా అందిస్తామని ముందుగా ప్రకటించిన డిస్నీ హాట్‌స్టార్.. అడ్వర్టైజ్‌మెంట్ రేట్స్‌ను మాత్రం భారీగా పెంచేసింది. కోప్రజెంటర్స్ అడ్వర్టైజింగ్ స్లాట్ ఫీజును రూ.150 కోట్లుగా నిర్ణయించిన హాట్‌స్టార్.. అసోసియేట్ స్పాన్సర్ల నుంచి 88 కోట్లు వసూలు చేయాలని భావిస్తున్న‌ట్టు ఇన్‌సైడ్ టాక్. హాట్‌స్టార్ రేట్ కార్డ్ ప్రకారం “పవర్డ్ బై” స్పాన్సర్‌ల వంటి ప్రముఖ ఎక్స్‌పోజర్ కావాలనుకునే బ్రాండ్‌లు తప్పనిసరిగా రూ. 75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంద‌ట‌. అయితే అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ను ఎంచుకునే వారు మాత్రం రూ. 40 కోట్ల బడ్జెట్‌ను అందించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. దాయాదుల పోరు సందర్భంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 10 సెకన్ల యాడ్‌కు రూ.30 లక్షలు వసూలు చేయ‌డం ఇదే తొలిసారి అంటున్నారు. గత వరల్డ్ కప్‌లో డిస్నీ హాట్‌స్టార్ 10 సెకన్ల యాడ్‌కు రూ.6 నుంచి 7 లక్షలు మాత్రమే చేయ‌గా, ఈ సారి మాత్రం భారీగా పెంచింది.