Donald Trump | మియామీ కోర్టుకు హాజ‌రైన ట్రంప్‌.. నేల చూపులు, న్యాయ‌వాదుల‌తో గుస‌గుస‌లు

అమెరికా : ర‌హస్య ప‌త్రాల‌ (Classified Documents )ను ప్రైవేటుగా ఉంచుకున్నార‌ని, ఆ స‌మాచారాన్ని ప‌లువురు వ్య‌క్తుల‌తో పంచుకున్నార‌ని త‌న‌పై ఆరోప‌ణ‌లొస్తున్న నేప‌థ్యంలో అమెరికా (America) మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కోర్టులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌ద్వారా క్ర‌మిన‌ల్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ కోర్టుకు హాజ‌రైన తొలి మాజీ అధ్య‌క్షుడిగా ట్రంపు రికార్డుకెక్కారు. నీలం రంగు సూట్‌, ఎరుపు టైతో ఫ్లోరిడాలోని మియామీ కోర్టుకు వ‌చ్చిన ఆయ‌న.. జడ్జి కోసం 15 నిమిషాలు ఎదురు […]

  • Publish Date - June 14, 2023 / 08:18 AM IST

అమెరికా : ర‌హస్య ప‌త్రాల‌ (Classified Documents )ను ప్రైవేటుగా ఉంచుకున్నార‌ని, ఆ స‌మాచారాన్ని ప‌లువురు వ్య‌క్తుల‌తో పంచుకున్నార‌ని త‌న‌పై ఆరోప‌ణ‌లొస్తున్న నేప‌థ్యంలో అమెరికా (America) మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కోర్టులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌ద్వారా క్ర‌మిన‌ల్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ కోర్టుకు హాజ‌రైన తొలి మాజీ అధ్య‌క్షుడిగా ట్రంపు రికార్డుకెక్కారు.

నీలం రంగు సూట్‌, ఎరుపు టైతో ఫ్లోరిడాలోని మియామీ కోర్టుకు వ‌చ్చిన ఆయ‌న.. జడ్జి కోసం 15 నిమిషాలు ఎదురు చూశారు. అక్క‌డ కూర్చున్నంత సేపు నేల చూపు చూస్తూ ఉన్నారు. కొన్ని సార్లు త‌న త‌ర‌పు న్యాయ‌వాదుల‌తో గుస‌గుస‌లాడారు త‌ప్ప ఎవ‌రితోనూ పెద్ద‌గా మాట్లాడ‌లేదు.

కాగా.. ఆయ‌న‌కు తోడుగా కుమారుడు ఎరిక్ ట్రంప్ వ‌చ్చారు. జ‌డ్జి రాగానే ట్రంప్ త‌ర‌పున హాజ‌ర‌యిన న్యాయ‌వాది సుమారు 49 పేజీలను చ‌దివి వినిపించారు. తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, నిర్దోషిన‌ని ట్రంప్ అందులో పేర్కొన్నారు. విచార‌ణ పూర్తి అయ్యే వ‌ర‌కు సాక్షుల‌ను క‌ల‌వ‌కూడ‌ద‌ని న్యాయ‌మూర్తి ట్రంప్‌కు సూచించారు.

Latest News