Earthquake | ఢిల్లీలో భారీ భూప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనం

Earthquake | దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌పై 6.6 తీవ్రతతో రాత్రి 10.19 గంటలకు భూకంపం సంభవించింది. ప్రకంపనలతో ఇండ్లలోని జనం బయటకు పరుగులుపెట్టారు. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందుఖుష్‌ పర్వత ప్రాంతాల్లో గుర్తించినట్లు నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ తెలిపింది. భారీ ప్రకంపనలు రావడంతో ఆరు దేశాల్లో ప్రకంపనలు వచ్చాయి. భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాలో ప్రకంపనలు రికార్డయ్యాయి. భారత్‌లో ఢిల్లీ […]

Earthquake | ఢిల్లీలో భారీ భూప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనం

Earthquake | దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌పై 6.6 తీవ్రతతో రాత్రి 10.19 గంటలకు భూకంపం సంభవించింది. ప్రకంపనలతో ఇండ్లలోని జనం బయటకు పరుగులుపెట్టారు. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందుఖుష్‌ పర్వత ప్రాంతాల్లో గుర్తించినట్లు నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ తెలిపింది. భారీ ప్రకంపనలు రావడంతో ఆరు దేశాల్లో ప్రకంపనలు వచ్చాయి. భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాలో ప్రకంపనలు రికార్డయ్యాయి. భారత్‌లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధితో పాటు ఉత్తరాఖండ్‌, పంజాబ్‌తో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దాదాపు రెండుసార్లు ప్రకంపనలు వచ్చాయి. రెండోసారి పాక్‌ ఇస్లామాబాద్‌, కజకిస్థాన్‌లో భూకంపం సంభవించింది.

భూకంపాలు ఎలా వస్తాయి?

భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం భూమి లోపల ప్లేట్లు ఢీకొనడమే. భూమి లోపల ఏడు పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఏదో ఒక సమయంలో ఢీకొన్నప్పుడు, అక్కడ ఒక ఫాల్ట్ లైన్ జోన్ ఏర్పడుతుంది. ఉపరితలం మూలలు ముడుచుకుంటాయి. ఉపరితలం మూలల కారణంగా అక్కడ ఒత్తిడి పెరుగుతుంది, ప్లేట్లు విరిగిపోతాయి. ఈ పలకల విచ్ఛిన్నం కారణంగా, లోపల ఉన్న శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. దాని కారణంగా భూమి కంపిస్తుంది. దీన్నే భూకంపంగా పరిగణిస్తారు. భూకంపాలు రావడానికి శాస్త్రపరమైన కారణాలే కాక పర్యావరణానికి జరుగుతున్న నష్టం కూడా కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.