Pakistan Earthquake: పాకిస్థాన్ లో భూకంపం!
పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం(Earthquake) కలకలం రేపింది. నిమిషాల వ్యవధిలోనే శనివారం రెండుసార్లు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.

Pakistan Earthquake: పాకిస్థాన్ : పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం(Earthquake) కలకలం రేపింది. నిమిషాల వ్యవధిలోనే శనివారం రెండుసార్లు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. శనివారం ఉదయం 11.54 నిమిషాల సమయంలో 4.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 1గంటకు మరోసారి 5.8తీవ్రతతో వచ్చిన భూకంకంతో రాజధాని ఇస్లామాబాద్ వణికిపోయింది. 10కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. భూప్రకంపనల ధాటికి పలు భవనాలు కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, దీనివల్ల తక్షణ ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. అత్యవసర సహాయక బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
యూరేషియన్, ఇండయన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్య పాకిస్తాన్ ఉంది. ఈ ప్రాంతం ఎక్కువగా భూకంపం సంభవించే రీజియన్ లో ఉంది. ప్లేట్స్ కదలికలు, సర్దుబాట్ల వలన అప్పుడప్పుడు పాక్ లో భూకంపాలు నమోదు అవుతూనే ఉంటాయి. బలూచిస్తాన్, ఖైబర్ కనుమలు, గిల్జిత్ బాల్టిస్తాన్ మొదలైన ప్రాంతాలు యూరేసియన్ ప్లేట్ కు దక్షిణంగా ఉన్నాయి. సింధు, పంజాబ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాతాలు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కు వాయువ్య (నార్త్ – వెస్ట్) దిశన ఉన్నాయి. ఈ రెండు ప్లేట్ల ఢీకొన్న ప్రతిసారీ ఈ ప్రాంతాలలో భూకంపం సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కేంద్రం తెలిపింది.
జమ్మూ కాశ్మీర్ లో ప్రకంపనలు
పాకిస్తాన్ భూకంప ప్రభావంతో పొరుగున ఉన్న భారత్ లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా పలు చోట్ల భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు.
పపువా న్యూ గినియాలోనూ
పపువా న్యూ గినియా(Papua New Guinea)లోనూ శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. శనివారం కోకోపో పట్టణానికి 115 కి.మీ. దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఒక నిమిషం పాటు భూమి కంపించింది. పపువా న్యూ గినియాలో భూకంపాలు సర్వసాధారణమే. అయినప్పటికీ ఈ ప్రకృతి విపత్తు కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇటీవల మయన్మార్, బ్యాంకాక్ లో 7.7తీవ్రతతో వచ్చిన భూకంప ప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే..3 వేల మందికి పైగాచనిపోగా..4 వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మందిని ఇంకా బయటకు తీసేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తునే ఉన్నాయి.