మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు
Minister Gangula Kamalaker | విధాత: కరీంనగర్ జిల్లాలోని పలు గ్రానైట్ సంస్థల వ్యాపారుల నివాసాల్లో ఏక కాలంలో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్), ఐటీ(ఇన్‌కం ట్యాక్స్) అధికారులో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మంత్రి ఇంటి తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహిస్తున్న అధికారులు. కరీంనగర్‌తో పాటు పంజాగుట్ట, ఉప్పర్‌పల్లిలోని ఆయన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20కి పైగా బృందాలు సోదాల్లో నిమగ్నమయ్యాయి. ఇక కరీంనగర్‌లోని అరవింద్ గ్రానైట్స్ […]

Minister Gangula Kamalaker | విధాత: కరీంనగర్ జిల్లాలోని పలు గ్రానైట్ సంస్థల వ్యాపారుల నివాసాల్లో ఏక కాలంలో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్), ఐటీ(ఇన్‌కం ట్యాక్స్) అధికారులో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మంత్రి ఇంటి తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహిస్తున్న అధికారులు.
కరీంనగర్‌తో పాటు పంజాగుట్ట, ఉప్పర్‌పల్లిలోని ఆయన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20కి పైగా బృందాలు సోదాల్లో నిమగ్నమయ్యాయి. ఇక కరీంనగర్‌లోని అరవింద్ గ్రానైట్స్ యజమాని ఇంట్లో, శ్వేతా గ్రానైట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమాజిగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ, ఐటీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోదాలు జరుగుతున్న కార్యాలయాలు, నివాసాల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు.